ఇది కుమారి ఆంటీ రేంజ్... బుల్లితెరపై సందడి షురూ! వీడియో వైరల్ 

First Published | Feb 7, 2024, 12:56 PM IST

కుమారి ఆంటీ రేంజ్ మారిపోయింది. ఆమె ఇప్పుడో సెలబ్రిటీ. కుమారి ఆంటీకి ఉన్న ఫేమ్ నేపథ్యంలో బుల్లితెర షోలకు ఆమెకు ఆహ్వానం దక్కుతుంది. తాజాగా ఆమె ఓ షోలో పాల్గొనగా వీడియో వైరల్ అవుతుంది. 
 

Kumari Aunty

సోషల్ మీడియా పుణ్యమా అని ఎందరో సామాన్యులు సెలెబ్రిటీలు అయ్యారు. వారిలో కుమారి ఆంటీ కూడా ఒకరు. కుమారి ఆంటీ దాదాపు 13 ఏళ్లుగా హైదరాబాద్ లో స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ చేస్తుంది. పలు రకాల వెజ్, నాన్ వెజ్ వంటకాలతో భోజనం అందుబాటు ధరల్లో సమకూరుస్తుంది. 

dasari sai kumari aunty, vantala aunty

కుమారి ఆంటీ వంటలు నచ్చడంతో రోజుకు వందల మంది అక్కడ భోజనం చేస్తారు. దీంతో యూట్యూబ్ ఛానల్స్ ఆమెను ఇంటర్వ్యూ చేశాయి. అక్కడ లభించే వంటకాలు, వాటి ధరలు తెలియజేస్తూ రీల్స్ సోషల్ మీడియాలో వదిలారు. ఆ విధంగా కుమారి ఆంటీ సోషల్ మీడియా సెలబ్రిటీ అయ్యారు. 


Kumari Aunty

ఈ క్రమంలో ఆమె వివాదాల్లో చిక్కుకున్నారు. ఆమె బిజినెస్ చేసే ప్రాంతం జనాలతో నిండిపోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఆమె వ్యాపారం మూసివేయించారు. తెలంగాణ ప్రభుత్వం మీద వ్యతిరేకత వ్యక్తం కావడంతో సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. 

కుమారి ఆంటీ అదే చోట తిరిగి వ్యాపారం చేసుకునేలా ఆదేశించారు. ఏకంగా సీఎంకే చెమటలు పట్టించిన కుమారి ఆంటీ మరింత ఫేమస్ అయ్యారు. స్వయంగా రేవంత్ రెడ్డి అక్కడ భోజనం చేయనున్నాడనే ప్రచారం జరిగింది. 
 

kumari aunty

కుమారి ఆంటీ పేరు మారుమ్రోగుతున్న తరుణంలో ఆమెకు పలు బుల్లితెర షోలకు ఆహ్వానం దక్కుతుంది. బీబీ ఉత్సవ్ పేరుతో స్టార్ మా లో ఒక షో త్వరలో ప్రసారం కానుంది. ఈ షోకి కుమారి ఆంటీ వెళ్లారు. అక్కడ వేదిక మీద బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ కి తన నాన్ వెజ్ వంటల రుచి చూపించారు. 

Kumari Aunty

శ్రీముఖి యాంకర్ గా ఉన్న ఈ షో మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. భవిష్యత్ లో కుమారి ఆంటీ మరిన్ని సంచనాలు చేయడం ఖాయం. ఆమె వెండితెర మీద కూడా కనిపించే అవకాశం లేకపోలేదు. 

Latest Videos

click me!