నెపోటిజం పై మృణాల్ ఠాకూర్ ఘాటు వ్యాఖ్యలు..

First Published Feb 7, 2024, 12:19 PM IST

ఈమధ్య స్టార్స్ లైఫ్ లో చేదు అనుభవాలు అనేవి కామన్ అయ్యాయి. ఏదోఒక సందర్భంలో అవమాన పడ్డ తారలు.. తమ బాధను మరో సందర్భంలో వెల్లడించడం పరిపాటిగామారింది.తాజాగా స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కూడా తనకు ఎదురైన అనుభవాన్ని వెల్లడించింది. 

ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో సొంత ఇమేజ్ తో ఎదిగింది హీరోయిన్ మృణాల్ ఠాకూర్. సీరియల్స్ లో వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని.. తన టాలెంట్ చూపించి.. ఎంతో మంది అభిమానులు సంపాదించుకుంది. అంతే కాదు.. బాలీవుడ్ అవకాశాలు కూడా అందిపుచ్చుకుంది. వెండితెరపై తనదైన మార్క్ చూపించి.. మనసులు గెలుచుకుంది మృణాల్. 

ఇక బాలీవుడ్ నుంచిటాలీవుడ్ వైపు అడుగులు వేసి.. సీతారామం సినిమాతో అదరగొట్టింది. అద్భుతం చేసింది. తాజాగా హాయ్ నాన్న అంటూ అభిమానులను పలకరించిన మృణాల్.. త్వరలో విజయ్ దేవరకొండ జోడీగా ఫ్యామిలీ స్టార్ తో రాబోతోంది. ఈక్రమంలో మృణాల్ జాగ్రత్తగా అడుగులు వేస్తూ.. అంచలంచలుగా ఎదుగుతూ వస్తోంది. 
 

Latest Videos


ఇండస్ట్రీలో ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి.. స్టార్స్ గా మారిన వారికి.. ఇండస్ట్రీలో ఉన్న నెపో కిడ్స్ వల్ల అవమానాలు జరుగుతూనే ఉన్నాయి. అటు ఇండస్ట్రీ..ఇటు మీడియా..అటు ఆడియన్స్ కూడా నెపోటీజమ్ ను ప్రోత్సహించే విధంగా ప్రవర్తిస్తుండటంతో.. కష్టపడి పైకి వచ్చేవారు వారి వల్ల బాధపడాల్సి వస్తోంది. ఈక్రమంలో మృణాల్ కు కూడా ఈ విధంగానే చేదు అనుభవం ఎదురయ్యింది. 
 

ఈ విషయాన్ని మృణాల్ స్వయంగా  వెల్లడించింది. రీసెంట్ గా  బాలీవుడ్ లో జరిగిన ఓ అవార్డుల వేడుకలో తనకి ఎదురైన చేదు అనుభవాన్ని మృణాల్..  పంచుకున్నారు. ఆ అవార్డుల వేడుకలో మృణాల్ ఠాకూర్ దగ్గర కొందరు మీడియా ప్రతినిథులు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. అయితే ఇంతలో ఒక స్టార్ కి సంబంధించిన వారసుడు అక్కడికి వచ్చాడు. దీంతో మీడియా వాళ్ళు మృణాల్ తో ఇంటర్వ్యూని మధ్యలో ఆపేసి.. ఆ స్టార్ కిడ్ దగ్గరకి పరుగులు పెట్టారు.

ఆ సందర్భంలో ఆమె ఫీలింగ్స్ ఎలా ఉంటాయి. మీడియా అయినాఅర్ధం చేసుకోవాలి కదా..అని నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. అంతే కాదు ఈ విషయాన్ని తెలియజేస్తూనే.. మృణాల్ నెపోటిజం పై వైరల్ కామెంట్స్ చేశారు. ప్రతి ఒక్కరు నెపోటిజం విషయంలో స్టార్ కిడ్స్ ని నిందిస్తూ ఉంటాము. కానీ ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. నెపోటిజం అనేది స్టార్ కిడ్స్ తప్పు కాదు అన్నారు. 

ప్రతి ఒక్క ఆడియెన్ స్టార్ కిడ్స్ గురించి తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటారు. దీంతో మీడియా కూడా ఆ వార్తలనే రాయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటుంది అన్నారు మృణాల్. ప్రస్తుతం ఈకామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. నెపోటీజం ను పెంచి పోషిస్తున్నది ఇండస్ట్రీమాత్రమే కాదు.. మీడియా, ఆడియన్స్ కూడా అంటూ చాలామంది కామెంట్ చేస్తున్నారు. 

click me!