నెపోటిజం అనే మాట రాజకీయాల్లో, సినిమాల్లో ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. చిత్ర పరిశ్రమలో నటీనటుల వారసులకు పెద్దపీట వేస్తుంటారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో రాణించే వారి సంఖ్య తక్కువగా ఉంటుంది అనే అభిప్రాయం ఉంది.
ఎవరైనా బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటి సక్సెస్ కావడానికి చాలా కష్టపడాలి. ఒకవేళ సక్సెస్ అయినప్పటికీ స్టార్ కిడ్స్ తో సమానంగా గుర్తింపు ఉండదు. అయితే నెపోటిజం వల్ల ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన నటీనటులు ఎలాంటి ఇబ్బందులు పడతారో ఓ ఇంటర్వ్యూలో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ కామెంట్స్ చేసింది.
నెపోటిజం వల్ల తనకు ఎదురైన చేదు అనుభవాన్ని మృణాల్ తాజా ఇంటర్వ్యూలో రివీల్ చేసింది. ఓ అవార్డుల వేడుకలో మృణాల్ ఠాకూర్ మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తుందట. అదే సమయంలో అక్కడికి ఒక స్టార్ కిడ్ వచ్చింది. వెంటనే మీడియా మొత్తం నన్ను మధ్యలోనే వదిలేసి ఆమె దగ్గరికి పరుగులు పెట్టారు. అలా చేయడం తనకి చాలా ఇబ్బంది కరంగా అనిపించినట్లు మృణాల్ పేర్కొంది. ఆ స్టార్ కిడ్ ఎవరో కాదు.. అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్.
నెపోటిజం గురించి అందరూ మాట్లాడతారు. కానీ దానిని ప్రోత్సాహిస్తున్నది ఎవరో కూడా తెలుసుకోవాలి. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నెపోటిజంలో స్టార్ కిడ్స్ ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క ప్రేక్షకుడు స్టార్ కిడ్స్ ఏం చేస్తున్నారో తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. కాబట్టి మీడియా కూడా అలాంటి వార్తలే రాస్తుంది.
ఇక్కడ నెపోటిజంని ప్రోత్సాహించే వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది ప్రేక్షకుల గురించే అని మృణాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బ్యాగ్రౌండ్ లేకుండగా ఇండస్ట్రీకి వస్తే ఏ ప్రేక్షకుడు పట్టించుకోరు అని తెలిపింది. సక్సెస్ సాధించిన తర్వాత కూడా స్టార్ కిడ్స్ నే ఎక్కువగా గుర్తిస్తారు అని ఆవేదన వ్యక్తం చేసింది.
గతంలో హీరో నాని కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి కొడుకు సినిమా రిలీజ్ అయితే లక్షల మంది ఆడియన్స్ వెళతారు. నెపోటిజం ఇండస్ట్రీలో ఉన్న ఫ్యామిలీస్ లో లేదు.. వారిని ఆదరిస్తున్న ఆడియన్స్ లో ఉంది అని నాని గతంలో కామెంట్స్ చేశాడు.