కుబేర సినిమా సింగిల్ లైన్ స్టోరీ, శేఖర్ కమ్ముల డైరెక్షన్ బాలేదు, ఇలా చేస్తాడు అనుకోలేదు, కాని ధనుష్ పర్ఫామెన్స్ మాత్రం అద్భుతంగా ఉంది అని ట్వీట్ చేశారు ఓ నెటిజన్. అంతే కాదు దేవిశ్రీ మ్యుజిక్ అయితే అస్సలు బాలేదు. కొట్టిన ట్యూన్స్ నే మళ్ళీ మళ్లీ కొడుతున్నాడు అంటూ సోషల్ మీడియాలో విమర్శలు చాలా ఘాటుగానే వినిపిస్తున్నాయి.
అంతే కాదు ఈసినిమాపై పనికట్టుకుని నెగెటీవ్ ప్రచారం చేయడానికి ఓ బ్యాచ్ దిగిందంటూ కొన్ని పోస్ట్ లు ట్వీట్టర్ లో కనిపిస్తున్నాయి. కావాలని సినిమా రిలీజ్ కు ముందే ఇలాంటివి ప్రచారం చేస్తున్నారంటూ.. కొన్నిఫేక్ పోస్ట్ లను ట్విట్టర్ లో చూపిస్తున్నారు ఫ్యాన్స్. ఓవర్ ఆల్ గా చూసుకుంటే ట్విట్టర్ లో ఆడియన్స్ ఇచ్చిన రివ్యూ ప్రకారం కుబేర సినిమా వారికి బాగా నచ్చింది.
కానీ ఈ సినిమా మ్యూజిక్ పైనే డౌట్. దేవిశ్రీ ప్రసాద్ లాంటి స్టార్ మ్యుూజిక్ డైరెక్టర్ గురించి ఎవరు గొప్పగా చెప్పలేదు. ఈసినిమాకు దేవిశ్రీ మ్యూజిక్ ప్లాస్ అవుతుందా, మైనస్ అవుతుందా..? ఇక లాంగ్ రన్ లో ఈసినిమా ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.