Published : Jun 15, 2025, 04:48 PM ISTUpdated : Jun 15, 2025, 04:51 PM IST
ధనుష్, రష్మిక మందన్నా, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం కుబేరా జూన్ 20న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతోంది.
ధనుష్, రష్మిక మందన్నా, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం కుబేరా జూన్ 20న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతోంది. అయితే కుబేర చిత్ర యూనిట్ ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. సాధారణంగా భారీ బడ్జెట్ లో రూపొందిన చిత్రాల కోసం నిర్మాతలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు టికెట్ ధరల పెంపు కోసం అప్లై చేస్తారు. అయితే కుబేర చిత్ర యూనిట్ మాత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల వద్ద టికెట్ ధర పెంపు కోసం ప్రత్యేక జీవోలు (GOs) కోరడం లేదట.
25
సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే టికెట్ ధరలు
ఇటీవల కాలంలో టికెట్ ధరల పెంపుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే “కుబేరా చిత్ర యూనిట్ టికెట్ ధరలు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా నిర్ణయించినట్లు తెలుస్తోంది.
35
టికెట్ ధరల వివరాలు
ప్రస్తుతం ప్లాన్ ప్రకారం, నగరాల్లోని మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధరలు ₹250 నుండి ₹295 మధ్య ఉండగా, సింగిల్ స్క్రీన్‌లలో ₹150 నుండి ₹200 వరకు ఉండే ఉన్నాయి. దీనితో కుబేర చిత్రం కోసం సాధారణ టికెట్ ధరలనే కొనసాగించనున్నారు.
ఈ చిత్రం నిర్మాణానికి ₹120 కోట్లకుపైగా ఖర్చు చేసినప్పటికీ, చిత్ర యూనిట్ మాత్రం తొలి వీకెండ్ లో వచ్చే వసూళ్ల కంటే లాంగ్ రన్ లో వచ్చే వసూళ్లే కీలకం అని భావిస్తోంది. టికెట్ ధరలు సాధారణ స్థితిలో ఉండడంవల్ల ఆడియన్స్ థియేటర్లకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
55
కుబేర మూవీ రన్ టైమ్
ఈ చిత్రానికి దాదాపు 3 గంటల 10 నిమిషాల నిడివి ఉన్నప్పటికీ, కథనంలో ఎంగేజ్‌మెంట్ ఉంటుందని బృందం నమ్మకం వ్యక్తం చేస్తోంది. ఇటీవలే విడుదలై హిట్ అయిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం టికెట్ ధర పెంపు లేకుండానే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. కుబేరా బృందం కూడా అదే తరహా వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఎగ్జిబిటర్‌గా పేరు తెచ్చుకుని, ఇప్పుడు నిర్మాతగా మారిన సునీల్ నారంగ్ నిర్మిస్తున్న ఈ చిత్రం పరిశ్రమలో వేగంగా పెరుగుతున్న టికెట్ ధరలపై సరికొత్త చర్చని లేవనెత్తింది.