Kritika Kamra Wedding: నటి కృతిక కమ్రా, గౌరవ్ కపూర్ ఈ మార్చిలో పెళ్లితో ఒక్కటవ్వబోతున్నారు. ముంబైలో చాలా సింపుల్‌గా, కొద్దిమంది బంధుమిత్రుల మధ్య ఈ వేడుకను జరుపుకోనున్నారు.
కృతిక, గౌరవ్ మార్చి 11న ముంబైలోని గౌరవ్ ఇంట్లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోనున్నారు. మార్చి 12న స్నేహితులు, సినీ, క్రికెట్ ప్రముఖుల కోసం ఓ గ్రాండ్ పార్టీ ఇవ్వనున్నారు. ఆడంబరాలకు పోకుండా, సింపుల్‌గా ఈ వేడుకను ప్లాన్ చేశారు.
23
చడీచప్పుడు లేకుండా పెరిగిన ప్రేమ
గత ఏడాది డిసెంబర్‌లో గౌరవ్‌తో బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్న ఫోటోలను కృతిక షేర్ చేసింది. గౌరవ్ పాపులర్ షో 'బ్రేక్‌ఫాస్ట్ విత్ ఛాంపియన్స్' పేరును గుర్తుచేస్తూ, తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించింది. గౌరవ్‌కు ఇదివరకే 2014లో నటి కిరాత్ భట్టల్‌తో వివాహమైంది, కానీ 2021లో వారు విడిపోయారని సమాచారం.
33
కృతిక కమ్రా కెరీర్ జర్నీ
కృతిక కమ్రా టీవీ నటిగా కెరీర్ మొదలుపెట్టింది. ఆ తర్వాత 'తాండవ్', 'కౌన్ బనేగీ శిఖర్‌వతి', 'బంబై మేరీ జాన్' వంటి వెబ్ సిరీస్‌లతో పాటు 'మిత్రోన్', 'భీడ్' లాంటి సినిమాల్లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.