Director Maruthi: రాజాసాబ్ తర్వాత కొత్త కథ రెడీ చేసిన మారుతి ? లిస్ట్ లో ఆ ఇద్దరు హీరోలు

Published : Feb 20, 2026, 09:06 PM IST

రాజాసాబ్ లాంటి భారీ చిత్రం తర్వాత డైరెక్టర్ మారుతి మరో కొత్త కథ సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కథకు హీరోగా మారుతి ఎవరిని అనుకుంటున్నారో ఈ కథనంలో తెలుసుకోండి. 

PREV
15
ప్రభాస్ రాజాసాబ్ మూవీ

రాజాసాబ్ చిత్రం కనుక హిట్ అయి ఉంటే రేంజ్ ఒక్కసారిగా మారిపోయేది. పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ వచ్చేది. కానీ రాజా సాబ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశ పరిచింది. ఈ సినిమా పరాజయానికి కథలో లోపాలు, విజువల్ ఎఫెక్ట్స్ ఇలా చాలా కారణాలు ఉన్నాయి. రాజాసాబ్ ఫ్లాప్ కావడంతో డైరెక్టర్ మారుతి నెటిజన్లు, ప్రభాస్ అభిమానుల నుంచి తీవ్రమైన ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వచ్చింది.

25
ఓటీటీలో రాజాసాబ్

ఇప్పుడు అదంతా ముగిసింది. రాజాసాబ్ చిత్రం ఓటీటీలోకి కూడా వచ్చేసింది. డైరెక్టర్ మారుతి కూడా మూవీ ఆన్ అయిపోతున్నారు. మారుతి తన నెక్స్ట్ మూవీపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ మారుతి రాజాసాబ్ ఫ్లాప్ నుంచి బయటకు వచ్చి ఓ కొత్త కథ తాయారు చేసుకున్నారట.

35
కొత్త కథ రెడీ చేసుకున్న మరుతి

కేరళలో ప్రశాంతంగా కూర్చుని తన వద్ద ఉన్న కొత్త పాయింట్ ని డెవలప్ చేశారట. కథ అయితే రెడీ చేసుకున్నారు కానీ మరి హీరో ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. జరుగుతున్న ప్రచారం ప్రకారం మారుతి తాను రాసుకున్న కథ వరుణ్ తేజ్ లేదా రామ్ పోతినేని లాంటి యువ హీరోలకు సెట్ అవుతుంది అని భావిస్తున్నారు.

45
హీరో ఎవరు ?

ఈ చిత్రం మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఉండే అవకాశం ఉంది. అయితే హీరోగా రామ్, వరుణ్ లలో ఎవరు ఫిక్స్ అవుతారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. మారుతికి ఈ సినిమా అగ్నిపరీక్ష లాంటి సినిమా అవుతుంది. రాజాసాబ్ లాంటి ఫ్లాప్ తర్వాత మారుతి తన నెక్స్ట్ మూవీతో తప్పనిసరిగా నిరూపించుకోవాల్సి ఉంటుంది.

55
బిజీగా వరుణ్ తేజ్

రామ్ పోతినేని చివరగా ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రంతో ఫ్లాప్ అందుకున్నాడు. ప్రస్తుతం 2 కథలపై వర్క్ చేస్తున్నాడు. వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు సినిమాతో బిజీగా ఉన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories