Bigg Boss Telugu 9 విన్నర్‌ని చేయనందుకు ఇమ్మాన్యుయెల్‌ బరస్ట్.. ఓటింగ్‌ కోసం అమ్మనాన్న ఊర్లన్నీ తిరిగారంటూ కన్నీళ్లు

Published : Feb 20, 2026, 09:04 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 9లో బెస్ట్ ఎంటర్‌టైనర్‌ అనిపించుకున్నారు ఇమ్మాన్యుయల్‌. విన్నర్‌ కాలేకపోవడంపై ఆయన ఇన్నాళ్లు మౌనంగా ఉన్నాడు. కానీ ఇప్పుడు బరస్ట్ అయ్యాడు. తన బాధని మొత్తాన్ని వెల్లడించారు. 

PREV
15
బిగ్‌ బాస్‌ తెలుగు 9 విన్నర్‌గా నిలిచిన కళ్యాణ్‌

బిగ్‌ బాస్‌ తెలుగు 9 గత డిసెంబర్లో ముగిసింది. 22 మంది కంటెస్టెంట్లు పాల్గొన్న ఈ షోలో కామన్‌ మేన్‌ కేటగిరిలో వచ్చిన కళ్యాణ్‌ పడాల విన్నర్‌గా నిలిచాడు. డీమాన్‌ పవన్‌, ఇమ్మాన్యుయెల్‌, సంజనా, తనూజ, కళ్యాణ్‌ టాప్‌ 5లోకి వెళ్లగా, మొదట సంజనా, ఆ తర్వాత ఇమ్మాన్యుయెల్‌, డీమాన్‌ పవన్‌ ఎలిమినేట్‌ అయ్యారు. తనూజ రన్నరప్‌గా నిలిచింది. కళ్యాణ్‌ విన్నర్‌ అయ్యారు. మరోసారి కామనర్‌ బిగ్‌ బాస్‌ ట్రోఫీ గెలిచి సంచలనం సృష్టించారు.

25
ఇమ్మాన్యుయెల్‌ని విన్నర్‌ని చేయకపోవడంపై ట్రోల్స్

అయితే బిగ్‌ బాస్‌ తెలుగు 9 గ్రాండ్‌ ఫినాలే పూర్తయ్యాక షోపై చాలా ట్రోలింగ్‌ నడిచింది. అసలైన విన్నర్‌ ఇమ్మాన్యుయెల్‌ అని చాలా మంది నెటిజన్లు స్వతహాగా స్పందించి తమ అభిప్రాయాన్ని తెలిపారు. ఇమ్మాన్యుయెల్‌ని ట్రెండ్‌ చేశారు. ఇమ్మాన్యుయెల్‌కి అన్యాయం జరిగిందని వెల్లడించారు. అయితే తాను ఎలిమినేషన్‌ సమయంలో ఇమ్మూ కూడా ఎమోషనల్‌గా కనిపించారు. సీజన్‌ మొత్తంలో ఇమ్మాన్యుయెల్‌ బెస్ట్ ఎంటర్‌టైనర్‌గా నిలిచాడు. ఆటలు ఆడటం, టాస్క్ ల్లో పాల్గొనడం, ఎంటర్‌టైన్‌ చేయడం వంటి వాటిలో ముందున్నాడు. బెస్ట్ ఎంటర్‌టైనర్‌ అనిపించుకున్నాడు. కానీ ఆయన్ని కాకుండా కళ్యాణ్‌ని విన్నర్‌ చేయడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కానీ ఇమ్మాన్యుయెల్‌ అప్పుడు ఒక్క మాట కూడా అనలేదు.

35
విన్నర్‌ కాకపోవడంపై ఇమ్మాన్యుయెల్‌ బరస్ట్

కానీ ఇన్నాళ్లకి బరస్ట్ అయ్యాడు. తన మనసులో ఉన్న బాధని వెల్లడించాడు. అమ్మ, నాన్నలు పడ్డ కష్టాన్ని గుర్తు చేస్తూ ఆయన షోలో ఎమోషనల్‌ అయ్యారు. తానే విన్నర్‌ అని ఎన్నో ఆశలతో ఉన్నారట, కానీ అది జరగకపోయే సరికి తట్టుకోలేకపోయినట్టు చెప్పాడు.. అమ్మని పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు ఇమ్మాన్యుయెల్‌. తాజాగా బిగ్‌ బాస్‌ తెలుగు 9లో పాల్గొన్న కంటెస్టెంట్లతో బీబీ ఉత్సవం పేరుతో ప్రత్యేకమైన స్పెషల్‌ షోని ప్లాన్‌ చేశారు. శ్రీముఖి యాంకర్‌గా చేసే ఈ షో ఈ ఆదివారం ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమోలు విడుదల చేస్తున్నారు. ఇందులో ఇమ్మాన్యుయెల్‌ అమ్మ కూడా పాల్గొంది. ఈ సందర్భంగా ఇమ్మాన్యుయెల్‌ బరస్ట్ అయ్యాడు. తన బాధని వ్యక్తం చేశాడు.

45
ఓటింగ్‌ కోసం క్యారేజీ కట్టుకుని అమ్మానాన్న ఊర్లన్నీ తిరిగారు

ఇందులో ఇమ్మన్యుయెల్‌ చెబుతూ, ఎంటర్‌టైనర్లని విన్నర్‌గా చూడరని నాకు తెలుసు. ఎందుకు చూడరు, మనం గేమ్‌ ఆడితే చూస్తారు కదా అని కష్టపడి ఆడినట్టు చెప్పారు. ఈ క్రమంలో ఇమ్మాన్యుయెల్‌ కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. తాను ఓడిపోయినందుకు ఇంత కూడా బాధపడలేదని, కానీ అమ్మానాన్నలు క్యారేజీలు కట్టుకొని బైక్‌పై దాదాపు 90 ఊర్లు తిరిగారట. తనకు ఓట్‌ వేయాలని ప్రచారం చేశారట. అంతగా కష్టపడ్డారని, కానీ ఇప్పటికీ తన మైండ్‌లో అదే రన్‌ అవుతుందని చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు ఇమ్మాన్యుయెల్‌. తన మనసులో ఉన్న బాధనంతా బయటపెట్టాడు. దీంతో అక్కడ ఉన్న కంటెస్టెంట్లంతా ఎమోషనల్‌ అయ్యారు. ఇమ్మాన్యుయెల్‌ అమ్మ మాత్రం ఆయన్ని పట్టుకొని బోరున విలపించింది. ఇది అందరిని కదిలించింది. 

55
ఇమ్మాన్యుయెల్‌ నిజమైన విన్నర్‌

దీనిపై భరణి స్పందించారు. కప్‌ కోసం పాల్గొన్న అందరు ఆడతారని, కానీ 360 డిగ్రీల కోణంలో గేమ్‌ ఆడింది మాత్రం ఇమ్మాన్యుయెల్‌ అని తాను గర్వంగా చెప్పగలను అని వెల్లడించారు భరణి. ఆయనే నిజమైన విన్నర్‌ అని తెలిపారు. బీబీ ఉత్సవానికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో వైరల్‌ అవుతుంది. అందరిని కదిలిస్తుంది. ఇందులో నాగార్జున కూడా పాల్గొన్నారు. ఒక్కొక్కరి గురించి ఆసక్తికర కామెంట్లు చేశారు. ఆద్యంతం ఫన్నీగా ఈ ప్రోమో సాగింది. చివర్లో  హీరో నిఖిల్‌ పాల్గొని ఇమ్మాన్యుయెల్‌కి షీల్డ్ ఇవ్వడం విశేషం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories