Pawan Kalyan: ఫిల్మ్ ఇండస్ట్రీలో హిరోయిన్లు హీరోల జంటగా మాత్రమే కాదు డిఫరెంట్ పాత్రల్లో నటించి మెప్పించారు. తండ్రీ కొడుకులు ఇద్దరికి జంటగా నటించిన హీరోయిన్లు ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ కు ప్రేయసిగా, చరణ్ కు అక్కగా నటించిన హీరోయిన్ మీకు తెలుసా?
ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు జోడీలుగా మాత్రమే కాదు రకరకాల పాత్రల్లో నటించి మెప్పించిన వారు ఉన్నారు. ఒకే ఫ్యామిలీ నుంచి తండ్రి కొడుకులు, అన్నా తమ్ముడిగా ఉన్న హీరోలతో ఆడి పాడిన హీరోయిన్లు ఉన్నారు. మరీ ముఖ్యంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ లాంటి మెగా హీరోల సరసన నటించి హీరోయిన్లు ఉన్నారు. ఈక్రమంలో పవన్ కళ్యాణ్ కు ప్రేయసిగా నటించిన ఓ హీరోయిన్, రామ్ చరణ్ కు అక్కగా నటించి మెప్పించింది. ఇంతకీ ఎవరా బ్యూటీ.
25
కృతి కర్బందా టాలీవుడ్ ఎంట్రీ
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు వచ్చి పోతూ ఉంటారు. కానీ కొందరే మాత్రమే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. అలాంటి వారిలో బాలీవుడ్ నటి కృతి కర్బందా (Kriti Kharbanda) ఒకరు. ఈ అందాల తార తెలుగులో కొద్ది సినిమాలు చేసినా, రెండు మెగా హీరోలతో చేసిన పాత్రల వల్ల ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది.కృతి కర్బందా 2009లో "బోణి" అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమాలోనే తన అందం, అభినయంతో మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత "అలా మొదలైంది" సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో కనిపించింది. కానీ ఆమెకు అసలు గుర్తింపు వచ్చిందే పవన్ కల్యాణ్ సినిమా వల్ల.
35
తీన్ మార్ లో కృతి
2011లో విడుదలైన "తీన్ మార్" (Teen Maar) సినిమాలో కృతి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రేయసిగా నటించింది. ఇందులో ఆమె పాత్రకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. అదే సమయంలో, కృతి నటనపై పరిశ్రమలో మంచి ఆదరణ ఏర్పడింది.
ఆ తర్వాత 2015లో విడుదలైన "బ్రూస్ లీ: ది ఫైటర్" (Bruce Lee: The Fighter) సినిమాలో రామ్ చరణ్‌కు అక్కగా నటించింది కృతి. ఈ సినిమాలో ఆమె పాత్ర చిన్నదైనా, కథను మలుపుతిప్పే పాత్రలో ఆమె కనిపించింది. ఇలా ఒకే నటి మెగా ఫ్యామిలీలో ఇద్దరు హీరోలతో వివిధ పాత్రల్లో కనిపించడం విశేషం.
55
కృతి నటించిన తెలుగు సినిమాలు
ఇంకా కృతి కర్బందా హీరో రామ్ కు జంటగా ఒంగోలు గిత్త సినిమాలో మెరిసింది, అంతే కాదు కళ్యాణ్ రామ్ జోడీగా ఒం 3Dలో కూడా నటించింది ఇక ఇక ఇవి కాకుండా గాళ్ల్ ఫ్రెండ్" వంటి సినిమాల్లో నటించింది. అయితే పెళ్లి తర్వాత తెలుగు సినిమాలకు కొంత దూరంగా ఉంటోంది. కృతి ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉంది. పులకిత్ సామ్రాట్ (Pulkit Samrat) అనే బాలీవుడ్ నటుడితో గతంలో ప్రేమలో ఉన్న కృతి, 2024లో అతనితో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఈ జంట కొన్నేళ్లు డేటింగ్ చేసి. ఆతరువాత పెళ్లి చేసుకున్నారు. తెలుగులో తక్కువ సినిమాలు చేసినప్పటికీ, పవన్ కళ్యాణ్ ప్రేయసిగా, రామ్ చరణ్ అక్కగా నటించిన పాత్రలతో కృతి కర్బందా టాలీవుడ్ ఆడియన్స్ కు గుర్తుండిపోయింది. ప్రస్తుతం ఆమె హిందీ సినిమాలలో నటిస్తూ కెరీర్ ను కొనసాగిస్తోంది.