Ghaati Collections: `ఘాటి` బాక్సాఫీస్ క్లోజింగ్‌ కలెక్షన్లు.. అనుష్కకు మరో ఊహించని దెబ్బ, కారణం ఏంటంటే?

Published : Sep 11, 2025, 05:52 PM IST

అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన 'ఘాటి' సినిమా గత వారం విడుదలైంది. క్రిష్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ వారం రోజుల్లో  బాక్సాఫీస్ వద్ద ఎంత వసూలు చేసిందో తెలుసుకుందాం.    

PREV
14
`ఘాటి` మూవీ బాక్సాఫీసు కలెక్షన్లు

దక్షిణాది సినీ పరిశ్రమలో లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచిన అనుష్క శెట్టి నటించిన 'అరుంధతి' సినిమా, మహిళా ప్రధాన సినిమాలకు నాంది పలికింది.  ఈ విజయం తర్వాతే ఇతర నటీమణులు కూడా అలాంటి సినిమాల్లో నటించడానికి ముందుకొచ్చారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'బాహుబలి' అనుష్కను పాన్ ఇండియా స్టార్‌గా నిలిపింది. కానీ ఆ తర్వాత ఆమె కెరీర్ ఒడిదుడుకులకు లోనవుతుంది. 

24
అనుష్కని దెబ్బకొట్టిన `సైజ్‌ జీరో`

దానికి కారణం 'సైజ్ జీరో'. ఆ సినిమా కోసం బరువు పెరిగిన అనుష్క తర్వాత బరువు తగ్గలేకపోయింది. దీంతో ఆమెకు అవకాశాలు తగ్గాయి. అప్పుడప్పుడు ఒకటి రెండు సినిమాల్లో నటిస్తోంది. చాలా గ్యాప్ తర్వాత నటించిన సినిమా 'ఘాటి'. క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో విక్రమ్ ప్రభు హీరో. సెప్టెంబర్ 5న విడుదలైంది.

34
అనుష్క `ఘాటి` కలెక్షన్లు ఎంత అంటే

రూ.50 కోట్ల బడ్జెట్‌తో 'ఘాటి' నిర్మితమైంది. విడుదలైనప్పటి నుంచి నెగెటివ్ టాక్ రావడంతో వసూళ్లు తగ్గాయి. మొదటి రోజు రూ.2 కోట్లు, రెండో రోజు రూ.1.74 కోట్లు, మూడో రోజు రూ.1.15 కోట్లు, నాలుగో రోజు రూ.65 లక్షలు, ఐదో రోజు రూ.58 లక్షలు, ఆరో రోజు రూ.27 లక్షలు వసూలు చేసింది. వారంలోనే థియేటర్ల నుంచి 'ఘాటి` మూవీ వాష్‌ ఔట్ అయ్యింది. అనుష్క కెరీర్‌లో మరో పరాజయం వచ్చి చేరింది. 

44
మదరాసి వర్సెస్‌ ఘాటి వసూళ్లు

అనుష్క నటించిన `ఘాటి` ఇప్పటివరకు రూ.6.39 కోట్లు మాత్రమే వసూలు చేసింది. రూ.10 కోట్లు కూడా దాటడం కష్టమే అంటున్నారు. 'ఘాటి'తోపాటు సెప్టెంబర్ 5న విడుదలైన శివ కార్తికేయన్ 'మదరాసి' మూవీ మొదటి రోజే తమిళనాడులో రూ.12 కోట్లకు పైగా వసూలు చేసింది. `ఘాటి` సినిమా క్లోజింగ్‌ కలెక్షన్లు కూడా `మదరాసి` మూవీ ఫస్ట్ డేని దాటడం కష్టమే. అయితే కలెక్షన్ల పరంగా `మదరాసి` ముందున్నా, ఓవరాల్‌ గా చూస్తే ఆ మూవీ కూడా పరాజయం దిశగానే వెళ్తుందని కోలీవుడ్ వర్గాల టాక్. అయితే దర్శకుడు క్రిష్‌ కొత్త కథని ఎంచుకున్నా, దాన్ని సరికొత్తగా తెరకెక్కించడంలో విఫలమయ్యారు. స్క్రీన్‌ ప్లేలో లోపాలున్నాయి. ఎమోషన్స్ ఆడియెన్స్‌ కి కనెక్ట్ కాలేదు. దీంతో మూవీ ఆకట్టుకోలేకపోయింది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories