కసిగా చూస్తూ కుర్రాళ్ల హృదయాల్లో కల్లోలం సృష్టిస్తున్న కృతి శెట్టి.. స్లీవ్‌లెస్‌ కుర్తాలో బేబమ్మ హంటింగ్‌

Published : Nov 20, 2022, 07:30 AM ISTUpdated : Nov 20, 2022, 08:40 AM IST

`ఉప్పెన` బ్యూటీ కృతి శెట్టి గ్లామర్‌ షోలో మరింత డోస్‌ పెంచుతున్న విషయం తెలిసిందే. కానీ బ్యూటీ స్కిన్‌ షో చేయకుండానే రచ్చ లేపుతుంది. హాట్‌నెస్‌ని యాడ్‌ చేస్తూ ఇంటర్నెట్‌ ని షేక్‌ చేస్తుంది.   

PREV
18
కసిగా చూస్తూ కుర్రాళ్ల హృదయాల్లో కల్లోలం సృష్టిస్తున్న కృతి శెట్టి.. స్లీవ్‌లెస్‌ కుర్తాలో బేబమ్మ హంటింగ్‌

కృతి శెట్టి(Krithi Shetty) తాజాగా తన ఫోటో షూట్‌ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది. అవి కట్టిపడేసేలా, చూపుతిప్పుకోలేని విధంగా ఉండటం విశేషం. దీంతో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఇందులో కృతి శెట్టి అందం మరింత పెరిగిపోవడం విశేషం. 
 

28

రెడ్‌ బ్లాక్‌ మిక్స్ డ్ గా ఉన్న స్లీవ్‌ లెస్‌ కుర్తాలో మెరిసిపోతుంది కృతి శెట్టి. కల్లింగ్‌ లుక్స్ తో మంత్రముగ్దుల్ని చేస్తుంది. క్యూట్‌ అందాలకు హాట్ నెస్‌ తోడు కావడంతో ఆమె మరింత ఘాటుగా మారిపోయింది. దీంతో బేబమ్మ అందాలు ఘాటెక్కుతున్నాయని చెప్పొచ్చు. అదేసమయంలో ఈ నయా ఫోటోలు అభిమానులను ఎట్రాక్ట్ చేస్తున్నాయి. Krithi Shetty Photo Shoot.
 

38

ఓరకంగా కృతి సండే ట్రీట్ ఇచ్చిందని చెప్పొచ్చు. వీకెండ్‌ అదిరిపోయేలా ఉండాలని భావించిందో, లేక ఈ సండే తానే స్పెషల్‌గా ఉండాలనుకుందో ఏమో అదిరిపోయే ఫోటో షూట్‌తో అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. ఇంటర్నెట్‌లో తన గ్లామర్‌ ఫోటోలతో రచ్చ చేస్తుంది. 

48

ఈ సందర్భంగా ఓ సందేశాన్ని పంచుకుంది కృతి. మీ జీవితానికి మీరే సూర్యుడు. ఎందుకంటే ప్రతిదీ మీ చుట్టూ తిరుగుతుంది. అదే సమయంలో ఇతర జీవితాల్లోనూ కూడా సూర్యరశ్మిని ఎందుకు పంచకూడదు. ఈ ప్రపంచాన్ని ప్రకాశవంతంగా ఎందుకు మార్చకూడదు` అని పేర్కొంది. ఆమె అందాలతోనే మంత్రముగ్దుల్ని చేస్తుంటే, ఇలా హృదయాలను ఆకట్టుకునే సందేశంతోనూ ఆకట్టుకుంటుంది కృతి. అందుకే స్పెషల్‌ గా నిలుస్తుంది. 
 

58

కృతి శెట్టి కెరీర్‌ ఒడిదుడుకులతో సాగుతుంది. `ఉప్పెన` తో ఉవ్వెత్తుని లేచింది కృతి. తొలి చిత్రంతో స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. హీరోయిన్ల విషయంలో టాలీవుడ్‌లో టాప్‌ లీగ్‌లోకి చేరిపోయింది. కానీ ఆ క్రేజ్‌, పాపులారిటీ నేపథ్యంలో వరుసగా ఆఫర్లు రావడంతో మరో మాట లేకుండా ఓకే చెప్పేసింది. తర్వాత ఆమె నటించిన చిత్రాలన్నీ ఆల్మోస్ట్ డిజప్పాయింట్‌ చేశాయి. 
 

68

నానితో చేసిన `శ్యామ్‌ సింగరాయ్‌`, నాగచైతన్యతో నటించిన `బంగార్రాజు` ఫర్వాలేదనిపించాయి. కానీ రామ్‌ పోతినేనితో చేసిన `ది వారియర్స్`, నితిన్‌తో చేసిన `మాచర్ల నియోజకవర్గం`, సుధీర్‌బాబుతో చేసిన `ఆ అమ్మాయిగురించి మీకు చెప్పాలి` చిత్రాలన్నీ పరాజయం చెందాయి. దీంతో ఒక్కసారిగా బ్యాక్‌ అయ్యిందీ బ్యూటీ. 
 

78

ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తుందని తెలుస్తుంది. తాను చేసిన తప్పుని తెలుసుకుంది. అందుకే కొత్త ప్రాజెక్ట్ ల విషయంలో సెలెక్టీవ్‌గా ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఆమె నాగచైతన్యతో వెంకట్‌ ప్రభు సినిమాలో నటిస్తుంది. ఇది తెలుగు తమిళంలో బైలింగ్వల్ గా తెరకెక్కుతుంది. దీంతోపాటు ఇతర భాషలకు కూడా ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్‌ చేసుకుంటుందీ అందాల భామ. 

88

తొలి చిత్రంలో క్యూట్‌ అందాలతో మెస్మరైజ్‌ చేసింది కృతి శెట్టి. కోట్లాది మంది కుర్రాళ్ల డ్రీమ్‌ గర్ల్ అయ్యింది. ఇప్పుడు ఆ క్యూట్ నెస్‌కి హాట్‌నెస్‌ని జోడిస్తుంది. అందాల డోస్‌ పెంచుతుంది. మేకర్స్ ని ఆకర్షించే ప్రయత్నమా? మరి ఫాలోయింగ్‌ పెంచుకోవడమా? కారణం ఏదైనా కృతి అందాలు ఘాటెక్కుతున్నాయి. హాట్‌ డోస్‌ పెరగడంతో మత్తెక్కిస్తున్నాయి. లేటెస్ట్ ఫోటోల్లోనూ ఆమె యమ హాట్‌గా కనిపిస్తుండటం విశేషం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories