కానీ ఈ ఏడాది రిలీజ్ అయిన ‘ది వారియర్’,‘మాచర్ల నియోజకవర్గం’,‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చిత్రాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో కృతి శెట్టి కేరీర్ కు డేంజర్ బేల్స్ మోగుతున్నాయని అంటున్నారు. వచ్చే సినిమాలైనా హిట్ కొడితేనే కృతి ఇదే జోరును కొనసాగించనుంది. ప్రస్తుతం దర్శకుడు వెంకట్ ప్రభు - నాగచైతన్య కాంబోలో వస్తున్న చిత్రంలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే తమిళ సూపర్ స్టార్ సూర్య (Suriya)తో ‘వనంగాన్’ (Vanangaan)లో నటిస్తోంది.