యంగ్ హీరోని రిజెక్ట్ చేసిన కృతిశెట్టి.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కీర్తి సురేష్..

Published : Apr 02, 2022, 01:27 PM ISTUpdated : Apr 02, 2022, 01:29 PM IST

ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్న హీరోయిన్లలో కృతి శెట్టి ముందు వరసలో ఉంది. స్టార్ హీరోలతో వరుస ఆఫర్లు కొట్టేస్తన్న బేబమ్మ.. ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్న యంగ్ హీరో సినిమాను రిజెక్ట్ చేసిందట. 

PREV
18
యంగ్ హీరోని రిజెక్ట్ చేసిన కృతిశెట్టి..  గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కీర్తి సురేష్..

ఎంత పెద్ద స్టార్ అయినా సక్సెస్ ఉంటేనే విలువ ఉంటుంది. ఫెయిల్యూర్స్ వెంటాడుతున్న హీరోలతో సినిమా అంటే మేకర్స్ తో పాటు హీరోయిన్లు కూడా ఆలోచిస్తారు. ప్రస్తుతం డిమాండ్ ఉన్న హీరోయిన్ కృతి శెట్టి కూడా ఇలానే యంగ్ హీరోతో సినిమాను రిజెక్ట చేసిందట. 
 

28

శర్వానంద్ కొంతకాలంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. మహానుబావుడు సినిమా తరువాత శర్వాకు కరెక్ట్ సినిమా పడింది లేదు.రీసెంట్ గా  వచ్చిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా కూడా ఆయనను నిరాశ పరిచింది. అయినాసరే పట్టువదలని విక్రమార్కుడిలా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు శర్వానంద్.

38

ఈ క్రమంలోనే యంగ్ డైరెక్టర్  కృష్ణచైతన్య దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు శర్వ.  ఈసారి డిఫరెంట్ స్టోరీతో.. డిఫరెంట్ బ్యాక్ గ్రౌండ్ తో సినిమాను రూపొందించబోతున్నారు.ఈసినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కాలిఅని చూస్తున్నాడు శర్వా.

48

ఈ సినిమాలో శర్వానంద్ ఓ బిడ్డకి తండ్రి పాత్రలో కనిపించనున్నాడు. ఆయన సరసన నాయికగా కృతి శెట్టిని సంప్రదిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. కృతీనీ గతంలోనే ఈసినిమా గురించి అడిగి ఒప్పించారట మేకర్స్. కాని ఇప్పుడు ఈ సినిమాపై ఆలోచనలో పడిందట కృతీ. 

58

 కెరియర్ బిగినింగ్ లో వరుసగా స్టార్స్ తో సినిమాలు చేస్తున్న కృతీ..ఇప్పుడు ఇలా తల్లి పాత్రలు చేయడం మైనస్ అవుతుందని భావిస్తోందట. అంటే కాదు వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్న శర్వానంద్ తో సినిమా అంటే ఆలోచిస్తుందట. అంతే కాదు సినిమాకు సున్నితంగా నో చెప్పిందని టాక్. 
 

68

ఇక ఈ పాత్ర కోసం కృతి రిజెక్ట్ చేయగా.. మహానటి కీర్తి సురేష్ మాత్రం వెంటనే ఓకే చేసేసిందని టాక్. హీరోయిన్ గా కీర్తి సురేష్ కూడా ఇఫ్పుడిప్పుడే మంచి ఫామ్ లోకి వచ్చింది. మహేష్ బుబుతో సర్కారువారి పాట,  మెగస్టార్ చెల్లెలిగా భోళా శంకర్ సినిమాలు చేస్తుంది కీర్తి..
 

78

ప్రయోగాత్మక పాత్ర కోసం కీర్తి ఎప్పుడైనా రెడీ అంటుంది. సాధారణంగా చెల్లి పాత్రలు .. తల్లి పాత్రలు చేయడానికి యంగ్  హీరోయిన్లు అంగీకరించరు. కానీ కీర్తి సురేశ్ ఈ తరహా పాత్రలు చేయడానికి వెనుకాడదు. పెంగ్విన్ సినిమాలో ఒక బిడ్డకి తల్లిగా .. అన్నాత్తే లో రజనీకి చెల్లిగా కనిపించింది కీర్తి సురేశ్.
 

88

శర్వానంద్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. ప్రస్తుతం కీర్తి సురేష్ మహేష్ బాబుతో  సర్కారువారి పాట.. నానీతో జోడీగా  దసరా సినిమాలు చేస్తుంది. అటు కమర్షియల్ సినిమాలు, ఇటు ఎక్స్ పెర్మెంట్ మూవీస్ కూడ చేస్తుంది. 

click me!

Recommended Stories