ఉగాది సందర్భంగా బుల్లి తెరపై స్పెషల్ ప్రోగ్రామ్స్ సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా అంగరంగ వైభవంగా అంటూ జబర్థస్త్ టీమ్ తో పాటు.. సీరియల్ సెలబ్రిటీల సందడి ఆడియన్స్ ను గిలిగింతలు పెడుతుంది.
ఇక ఉగాది ఈ ఈవెంట్ లో స్టార్ సెలబ్రిటీ రోజాతో పాటు,జీవితా రాజశేఖర్,సీనియర్ నటీనటులు సందడి చేశారు. ముఖ్యంగా ఈవెంట్ మొత్తగానకి డాక్టర్ బాబు జంట స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.
26
బుల్లి తెర ప్రేక్షకులు ఎంతగానో అభిమానించే కార్తీక దీపం ఫేమ్ డాక్టర్ బాబు ఫ్యామిలీతో సందడి చేశాడు. అంతే కాదు ఈ ప్రోగ్రామ్ లో డాక్టర్ బాబకు కొత్తగా గంటలక్క కూడా దొరికింది. వీరి మధ్య లవ్ సింబర్స్, లవ్ సాంగ్ ట్రాక్ లతో హడావిడి చేశారు.
36
లేడీ గెటప్ లో ఉన్న జబర్ధస్త్ ఫేమ్ శాంతి స్వరూప్.. తనకు నిరుపమ్ మాజీ ప్రేమికుడంటూ.. డాక్టర్ బాబుతో స్పెషల్ ఫెర్ఫామెన్స్ ఇచ్చాడు. ఈ పెర్ఫామెన్స్ తో ఈవెంట్ లో అంతా నవ్వుల పువ్వులు పూశాయి.
46
అటు ఇదే ఛాన్స్ గా తీసుకున్న ఆది డాక్టర్ బాబుతో పాటు శాంతి స్వరూప్ ను కూడా ఒక ఆట ఆడుకున్నాడు. డాక్టర్ బాబు మీకు కొత్తగా గంటలక్క దొరికింది. ఇక నుంచి గంటలక్కతో డాక్టర్ బాబు .. గంటంగటకూ చూడండంటూ వరుస పంచులతో హడావిడి చేశాడు.
56
మొత్తానికి ఈవెంట్ అంతా డాక్టర్ బాబుగా నిరుపమ్, గంటలక్కగా శాంతిస్వరూప్ నవ్వుల్లో ముంచెత్తారు. అటు ప్రతీ సీన్ ను గమనిస్తున్న నిరుపమ్ సతీమణి మంజులా కూడా బాగా ఎంజాయ్ చేశారు.
66
ఈవెంట్ లో నిరుపమ్, మంజుల దంపతులకు మరోసారి పెళ్లి చేయడం.. సీనియర్ యాక్ట్రస్ తో కామెడీ చేయించడం.. జబర్ధస్త్ టీమ్ తో కామన్ గా కడుపుబ్బా నవ్వించే స్కిట్ లతో సందడి చేశారు.