గ్యాప్‌ ఇవ్వలేదు, వచ్చింది.. తెలుగులో మూవీస్‌పై కృతి శెట్టి క్రేజీ కౌంటర్‌.. ఏకంగా ఐదు సినిమాలతో కమ్‌ బ్యాక్‌.

Published : Jun 01, 2024, 02:32 PM IST

`ఉప్పెన` బ్యూటీ కృతి శెట్టి తెలుగులో సినిమాలు చేయకపోవడంపై స్పందించింది. గ్యాప్‌కి కారణమేంటో వెల్లడించింది. అదిరిపోయే కౌంటర్‌తో ఆమె ఆన్సర్‌ ఇవ్వడం విశేషం.   

PREV
15
గ్యాప్‌ ఇవ్వలేదు, వచ్చింది.. తెలుగులో మూవీస్‌పై కృతి శెట్టి క్రేజీ కౌంటర్‌.. ఏకంగా ఐదు సినిమాలతో కమ్‌ బ్యాక్‌.

`ఉప్పెన` చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది కృతి శెట్టి. ఈ సినిమా విజయంతో ఓవర్‌నైట్‌లో స్టార్‌ అయిపోయింది. `ఉప్పెన` బ్యూటీగా, బేబమ్మగా ఫేమస్‌ అయ్యింది. ఇప్పటికీ అదే ట్యాగ్‌ని మోస్తుంది. దాన్ని కొట్టే మూవీ ఇప్పటి వరకు రాలేదు. ఆ తర్వాత చేసిన చిత్రాలన్ని పరాజయం చెందాయి. కొంత గ్యాప్‌తో ఇప్పుడు కొత్త సినిమాతో తెలుగు ఆడియెన్స్ ని పలకరించబోతుంది కృతి శెట్టి. 
 

25

ప్రస్తుతం ఆమె శర్వానంద్‌తో కలిసి `మనమే` చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కృతి శెట్టి డిఫరెంట్‌ రోల్‌ చేస్తుంది. లవర్‌గా, మ్యారీడ్‌ ఉమెన్‌గా, పిల్లాడికి తల్లిగానూ చేస్తుంది. ఈ మూవీ కొత్తగా పెళ్లైన జంట మధ్య ప్రేమ, అనుబంధాలు, గొడవలు, ఎమోషనల్‌ సిచ్చువేషన్స్ ని ఆవిష్కరించే మూవీ అవుతుందని ట్రైలర్‌ని బట్టి తెలుస్తుంది. చాలా కొత్తగానూ అనిపిస్తుంది. 
 

35

ఈ సందర్భంగా తన గ్యాప్‌పై స్పందించింది కృతి శెట్టి. తెలుగులో గ్యాప్‌ రావడానికి కారణమేంటి? సినిమాలు రావడం లేదా? మీరు చేయడం లేదా? అనే ప్రశ్నకి ఆమె స్పందిస్తూ, గ్యాప్‌ రాలేదని, వచ్చిందని తెలిపింది. `అలా వైకుంఠపురములో` చిత్రంలో ఆ డైలాగ్‌ బాగా ఫేమస్‌ అయ్యింది. సేమ్‌ అదే డైలాగ్‌ కొట్టి వాహ్‌ అనిపించింది కృతి శెట్టి. ఆమె ఆన్సర్‌కి ఫ్యాన్స్ హో ఏసుకోవడం విశేషం. 
 

45

ఈ సందర్భంగా కృతి శెట్టి.. గ్యాప్‌ అనుకోకుండా వచ్చింది. ప్లాన్‌ చేయలేదు. తాను తమిళంలో, అలాగే మలయాళంలో సినిమాలు చేస్తున్నానని, దీంతో ఇక్కడ గ్యాప్‌ వచ్చిందని తెలిపింది. దాని కారణంగా వచ్చిందే తప్పితే కావాలని చేసింది కాదు, అయితే ఇప్పుడు ఐదు సినిమాలతో రాబోతున్నా అని చెప్పింది కృతి శెట్టి. ప్రస్తుతం తన చేతిలో ఐదు సినిమాలున్నట్టు వెల్లడించింది. 
 

55

ప్రస్తుతం తెలుగులో `మనమే`తో రాబోతుంది. ఇది ఈ వచ్చే శుక్రవారం విడుదల కానుంది. తమిళంలో మూడు సినిమాలు చేస్తుంది కృతి శెట్టి. `జెన్నీ`, `ఎల్‌ఐసీ`, `వా వాథియార్‌` చిత్రాలున్నాయి. దీంతోపాటు మలయాళంలో `ఏఆర్‌ఎం` చిత్రంలో నటిస్తుంది. ఈ ఐదు సినిమాలు ఈ ఏడాదిలోనే రిలీజ్‌ కాబోతున్నాయి. ఇదే జరిగితే కృతి శెట్టి బెస్ట్ కమ్‌ బ్యాక్‌ అని చెప్పొచ్చు. అయితే `ఉప్పెన` తర్వాత చెప్పుకోదగ్గ హిట్లు లేవు, ఈ మూవీస్‌ అయినా హిట్లు ఇస్తాయా అనేది చూడాలి. కృతి శెట్టి చివరగా `కస్టడీ` చిత్రంలో మెరిసిన విషయం తెలిసిందే. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories