ప్రభాస్ అక్కడ లేకపోవటమే అసలైన డ్రాబ్యాక్, ‘బుజ్జి అండ్ భైరవ’పై భారీ ఇంపాక్ట్?

Published : Jun 01, 2024, 08:51 AM IST

బుజ్జి, భైరవ పాత్రలకు ఉన్న రిలేషన్, ఈ ఇద్దరూ ఎలా కలిశారు అసలు వీరి ప్రపంచం ఏంటి? అని యానిమేషన్ ద్వారా రెండు ఎపిసోడ్‌లను అమెజాన్ ప్రైమ్‌లో వదిలారు. 

PREV
112
ప్రభాస్ అక్కడ  లేకపోవటమే అసలైన డ్రాబ్యాక్,  ‘బుజ్జి అండ్ భైరవ’పై భారీ ఇంపాక్ట్?
kalki 2898 ad

ఇప్పుడు అందరి దృష్టీ కల్కి 2898 ఏడీ చిత్రంపైనే ఉంది. ఈ చిత్రం ఈ నెల్లోనే  రిలీజ్ కాబోతోన్న సంగతి తెలిసిందే. దాంతో సినిమా ప్రమోషన్స్ మొదలెట్టారు. అయితే ప్రమోషన్స్ కేవలం మల్టిప్లెక్స్ జనాలను మాత్రేమ ఉద్దేసించినట్లు ఉంటున్నాయనే విమర్శ ఉంది. అయితే సినిమా సైన్స్ ఫిక్షన్ కూడా ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కు నచ్చటం ముఖ్యం అని దర్శక,నిర్మాతలు భావించినట్లు ఉన్నారు.  ఎందుకంటే ఈ సినిమాని ప్రభాస్ ఫ్యాన్స్ ఖచ్చితంగా చూస్తారు. 

212
Kalki 2829 AD

 పిల్లలకు నచ్చే ఎపిసోడ్స్ ఉన్నాయంటే ఫ్యామిలీలు కదులుతాయి. అందుకేనేమో   ఈ మూవీ నుంచి బుజ్జిని పరిచయం చేశారు. ఈ స్పెషల్ కారుతో సినిమాలో ప్రభాస్ అడ్వెంచర్లు చేయబోతోన్నాడని అర్థం అవుతోంది. అయితే ఈ బుజ్జి, భైరవ పాత్రలకు ఉన్న రిలేషన్, ఈ ఇద్దరూ ఎలా కలిశారు అసలు వీరి ప్రపంచం ఏంటి? అని యానిమేషన్ ద్వారా రెండు ఎపిసోడ్‌లను అమెజాన్ ప్రైమ్‌లో వదిలారు. ఇది ఓ రకంగా తెలుగు నుంచి మొదటి సారి చేసిన ప్రయోగం అని చెప్పాలి. మరి ఈ ప్రయోగాన్ని జనం ఎలా రిసీవ్ చేసుకున్నారనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన విషయం.

312

అయితే అమేజాన్ ఓటిటిలో ఈ యానిమేషన్ ఎపిసోడ్స్ చూసిన వాళ్లు బాగుందని మెచ్చుకుంటున్నారు. అయితే ప్రభాస్ ని ఒరిజనల్ గా చూపకుండా యానిమేషన్ లో చూపటం ఏంటనేది అభిమానులకు మంటగానే ఉంది. వాళ్లు రియల్ ప్రభాస్ ని చూడాలనుకుంటున్నారనేది నిజం. ఈ క్రమంలో వాళ్లలో కొందరు బాగా నిరాశపడ్డారని సోషల్ మీడియాలో ఈ యానిమేషన్ సీరిస్ ని పెద్దగా ప్రమోట్ చేయకపోవటాన్ని బట్టి అర్దమవుతోంది. 
 

412

నాగ్ అశ్విన్ చేసింది మంచి ప్రయోగమే. బుజ్జి భైరవ ఎపిసోడ్‌లను చూస్తే కల్కి మూవీ మీద ఓ అంచనా ఏర్పడుతుందనేది నిజం. కాకపోతే కేవలం ప్రమోషన్ మెటీరియల్ సైతం ఓటీటిలో డబ్బులు కట్టి మరీ చూడాలనుకోవటమే ఇబ్బంది అంటున్నారు. అయితే ఈ యానిమేషన్ హై క్వాలిటీతో చేసారు. బ్రహ్మీ, ప్రభాస్, కీర్తి సురేష్ వాయిస్ ఓవర్స్ జనాలకు బాగా నచ్చుతున్నాయి. కానీ ఈ ఎపిసోడ్స్ కు రావాల్సినంత అప్లాజ్ రావటం లేదనేది మాత్రం నిజం.

512

జనాల్లోకి ఈ ఎపిసోడ్స్ భారీగా వెళ్లకపోవటానికి కారణం ప్రభాస్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకపోవటమే అని తేలుస్తున్నారు. అదే పెద్ద డ్రాబ్యాక్ అంటున్నారు. అలా కాకుండా ప్రభాస్ కనుక ఈ ఎపిసోడ్స్ లింక్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తే వైడ్ రీచ్ ఉంటుందని చెప్తున్నారు. అయితే ఇక్కడే ఓ మెలిక ఉంది. అలా ప్రమోట్ చేస్తే పనిగట్టుకుని మరీ అమేజాన్ ప్రైమ్ ని ఎంకరేజ్ చేసినట్లు అవుతుందనే ఆలోచన ప్రభాస్ కు ఉండి ఉండవచ్చు కూడా. 
 

612

 ఇవాళ సోషల్ మీడియాని సెలబ్రెటీలు తెగ వాడుతున్నారు. ట్విట్టర్, ఇనిస్ట్రాల పోస్ట్ లతో అని ఫాన్స్ కు మరింత దగ్గరవుతున్నారు సెలబ్రిటీలు.కాని   ‘బాహుబలి’ సినిమాతో దేశ వ్యాప్తంగా అభిమానులను ఏర్పరుచుకున్న ప్రభాస్ మొదటి నుంచి సోషల్ మీడియాకు దూరమే. ఫ్యాన్స్  డిమాండ్ చేయడం వలన ఎట్టకేలకు ఆ మధ్యన  సోషల్ మీడియాలో అడుగుపెట్టి ఇంస్టాగ్రామ్ ఎకౌంట్ క్రియేట్ చేసినా యాక్టివ్ గా ఉండరు.  అయితే ప్రస్తుతం ఏ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ఓపెన్ చేసినా సరే… ప్రభాస్, మహేష్‌ బాబు ఫ్యాన్స్ చేస్తున్న రచ్చనే కనిపించటం గమనించవచ్చు. కాబట్టి సినిమా రిలీజ్ ప్రమోషన్స్ కు వారి ఫ్యాన్స్ ఖచ్చితంగా ప్రమోట్ చేస్తూ జనాల్లోకి తీసుకెళ్లతారు. 
 

712

అమేజాన్ ప్రైమ్ లో రిలీజైన  ఎపిసోడ్‌లను గమనిస్తే బ్రహ్మానందం, ప్రభాస్ ట్రాక్ హిలేరియస్‌గా ఉండేలా కనిపిస్తోంది. ఇక కాంప్లెక్స్, యూనిట్స్ అంటూ ఇలా కొత్త భాషను చూపించారు. డబ్బులు కాకుండా యూనిట్స్ అనే భాషలో మాట్లాడుకుంటున్నారు.  ఈ ఎపిసోడ్స్ కథ ప్రకారం ఏ పని చేయాలన్నా యూనిట్స్ ఇచ్చుకోవాల్సిందే. ఈ యూనిట్స్‌ను సంపాదించేందుకు భైరవ కష్టపడుతుంటాడు.బాగా యూనిట్స్ సంపాదించి.. ఓ మంచి వెహికల్ కొనుక్కుని.. ఆ తరువాత కాంప్లెక్స్‌ను దక్కించుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. 

812

కానీ భైరవకు ఊరంతా అప్పులే. అందరికీ ఎంతో కొన్ని యూనిట్లు బాకీ పడి ఉంటాడు. ఇంటి ఓనర్‌ (బ్రహ్మానందం)కి కూడా యూనిట్స్ బాకీ ఉంటాడు. అలాంటి భైరవ జీవితంలోకి బుజ్జి వస్తుంది. బుజ్జి సాయంతో అదిరిపోయే కారుని భైరవ తయారు చేస్తాడు. ఆ తరువాత నుంచి బుజ్జి, భైరవ స్నేహం ప్రారంభం అవుతుంది. ఈ ఇద్దరూ కలిసి చేసిన సాహసాలు ఏంటో చూడాల్సిందే.

912

ఈ యానిమేషన్ ఎపిసోడ్స్ మాత్రం పిల్లల్ని బాగానే ఆకట్టుకునేలా ఉన్నాయి. భైరవ చేసే జంప్‌లు, అడ్వెంచర్లు, కామెడీ టైమింగ్, డైలాగ్స్ ఇలా అన్నీ కూడా అదిరిపోయాయని పిల్లలు అంటున్నారు. అయితే  కల్కి 2898 ఏడీలో ఈ కథ అయితే ఉండదు. కేవలం ఇది ప్రమోషన్ మెటీరియలే అంటున్నారు. అక్కడ కూడా ఇదే కథ ఉంటుందా? అక్కడ ఏమైనా వేరేలా ఉంటుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరమైన విషయం.

1012

‘కల్కి 2898 ad ‘ వరల్డ్ ఎలా ఉంటుంది?’ అనేది ఈ ‘బుజ్జి అండ్ భైరవ’ యానిమేటెడ్ వెబ్ సిరీస్ ద్వారా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ‘తన సినిమా కాన్సెప్ట్ ఇలా ఉంటుంది’ అనేది చెబుతూ ప్రేక్షకుల్ని ప్రిపేర్ చేశాడు. ఎక్కడా బోర్ కొట్టేలా అయితే ఈ సిరీస్ లేదు. చూసిన జనం హ్యాపీగా ఉన్నారు.  ప్రభాస్ పాత్రకి, బ్రహ్మానందం పాత్రకి మధ్యలో వచ్చే సంభాషణలు చాలా కామెడీగా అనిపిస్తాయి. ప్రభాస్ డైలాగ్ డెలివరీ ‘బుజ్జిగాడు’ రోజుల్ని గుర్తు చేస్తుంది

1112

అయితే  సైన్స్ ని.. పురాణాల్ని ఆధారం చేసుకుని తీసిన ఈ సైన్స్ ఫిక్షన్ కమ్ టైం ట్రావెల్ మూవీ… మాస్ సెంటర్ ఆడియన్స్ కి ఎంత వరకు అర్థమవుతుంది? పోనీ సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ ఈ సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటారు? అనే అనుమానాలు కూడా రేకెత్తించింది ఈ సిరీస్. ప్రమోషన్స్ ని బట్టే కదా జనం సినిమ ాపై ఓ అంచనాకు వచ్చేది. 

1212
Kalki 2829 AD

ఏదైమైనా  కల్కి 2898 ad ‘ ప్రమోషన్స్ ని దర్శకుడు నాగ్ అశ్విన్ మొదటి నుండి వినూత్నంగా ప్లాన్ చేస్తూ వస్తున్నాడు. అదే సమయంలో బాగా ప్లాన్ చేస్తున్నాడు అని చెప్పాలి. నిర్మాతతో డబ్బు.. ఎక్కడ పెట్టించాలో, ఎలా పెట్టించాలో కూడా ఇతను ప్లాన్ చేసుకున్న విధానం బాగుంది. అలాగే ‘సినిమా ఏ జోనర్లో ఉంటుంది?’ అనేది గ్లింప్స్ ద్వారా చూపించాడు. ఆ గ్లింప్స్ ని విదేశాల్లో లాంచ్ చేసి.. ప్రపంచం మొత్తం ‘కల్కి 2898 AD’ వైపు చూసేలా చేశాడు

Read more Photos on
click me!

Recommended Stories