వైష్ణవ్ తేజ్ తో పెళ్లి వార్తలపై కృతీశెట్టి క్లారిటీ.. నిజంగా మెగా కోడులు కాబోతోందా..?

First Published | Sep 17, 2023, 1:24 PM IST

వైష్ణవ్ తేజ్ తో పెళ్లి వార్తలపై తాజాగా  స్పందించింది హీరోయిన్ కృతీ శెట్టి. తాను డైరెక్ట్ గా స్పందించ కుండా తన టీమ్ ద్వారా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆమె ఏమంటుందంటే..? 
 

ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది కృతీ శెట్టి. వరుసగా మూడు సినిమాలతో సూపర్ హిట్ కొట్టి లక్కీ హీరోయిన్ అన్న పేరు కూడా సంపాధించుకుంది. వరుసగా అవకాశాలు వస్తున్న టైమ్ లో.. వరుసగా ప్లాప్ లు పడ్డాయి కృతీ శెట్టికి. దాంతో ఆమె కెరీర్ ఎంత ఫాస్ట్ గా పైకి వెళ్లిందో.. అంతే ఫాస్ట్ గా డౌన్ అవుతూ  వచ్చింది. ప్రస్తుతం ఆమె చెతిలో పెద్దగా సినిమాలు లేవు. 

ఇక ఇలా కెరియర్ పరంగా కృతి శెట్టి బిజీగా ఉన్నా లేకున్నా.. నెట్టింట్లో మాత్రం యాక్టీవ్ గా ఉంటుంది బ్యూటీ. ప్రస్తుతం ఆమె మళ్ళీ పైకి లేవాలి అని చూస్తోంది. దానికి తగ్గ ప్రయత్నాలు కూడా చేస్తోంది. ఇక ప్రస్తుతం ఆమె మూవీ కెరీర్ గురించి..  తన వ్యక్తిగత విషయాల గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.  ఈ మధ్య మరీ ఎక్కువగా రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. 
 


గత వారం రోజులుగా ఈమె పెళ్లి చేసుకోబోతుందని మెగా ఇంటికి కోడలు కాబోతుంది అంటూ వార్తలు వినిపించాయి. మొదటి సినిమా ఉప్పెనలో కృతీ శెట్టి వైష్ణవ్ తేజ్ తో కలిసి నటించింది. ఫస్ట్ సినిమాలోనే వీరిద్దరు రొమాంటిక్ సీన్ ను అద్భుతంగా పండించారు. దాంతో..  ఈమె మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో ప్రేమలో పడ్డారని వీరి ప్రేమ విషయాన్ని రహస్యంగా ఉంచుతూ కెరియర్లో మంచి సక్సెస్ అందుకున్న తర్వాత ప్రేమ విషయాన్ని బయట పెట్టాలని భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

ఈ విధంగా కృతి శెట్టి కూడా మెగా ఇంటికి కోడలు కాబోతుందనే విషయం తెలియడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఈ వార్తలపై తాజాగా కృతి శెట్టి టీం స్పందించి క్లారిటీ ఇచ్చారు. కృతీ శెట్టి ఈ విషయంలో స్పందించకపోయినా..  ఆమె తన టీమ్ ద్వారా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా కృతి శెట్టి టీం ఈమె పెళ్లి వార్తల గురించి స్పందిస్తూ కృతి శెట్టి పెళ్లి గురించి వస్తున్నటువంటి వార్తలలో ఏ మాత్రం నిజం లేదని కొట్టిపారేశారు.

ఈమె (Krithi Shetty) ప్రస్తుతం తన కెరియర్ పై ఫోకస్ పెట్టారని పెళ్లి గురించి ఏమాత్రం ఆలోచించడం లేదు అంటూ తెలియచేశారు. ఇక ఈమె పెళ్లి చేసుకోబోతుందని మెగా ఇంటికి కోడలు కాబోతుంది అంటూ వస్తున్నటువంటి వార్తలన్నీ కూడా అవాస్తవమని ఈ సందర్భంగా క్లారిటీ ఇవ్వడంతో కృతి పెళ్లి వార్తలకు చెక్ పెట్టినట్టు అయింది.
 

ప్రస్తుతం సినిమాలు పెంచుకుని.. టాలీవుడ్ లో మళ్ళీ స్టార్ గా వెలగాలని ప్రయత్నం చస్తోంది కృతీ. ఒక్కసారి సాలిడ్ హిట్ పడితే చాలు.. మళ్లీ తన టైమ్ స్టార్ట్ అవుతుంది అన్న ఆలోచనలో ఉంది. కాని కృతీ శెట్టి కి రావల్సిన ఆఫర్లు మాత్రం అటు శ్రీలీల, ఇటు మృణాల్ ఠాకూర్ కు వెళ్తున్నట్టు తెలుస్తోంది. మరి కృతీ శెట్టి కెరీర్ ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి. 

Latest Videos

click me!