అట్లీ లైనప్.. బన్నీ, విజయ్ దళపతి, షారుఖ్ తో బిగ్ ప్రాజెక్ట్స్.? బాక్సాఫీస్ షేకే..

Sreeharsha Gopagani | Updated : Sep 17 2023, 12:49 PM IST
Google News Follow Us

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ ‘జవాన్’తో భారీ సక్సెస్ ను అందుకున్నారు. ఈ క్రమంలో నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై ఆసక్తి నెలకొంది. బిగ్ స్టార్స్ తో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. 
 

16
 అట్లీ లైనప్.. బన్నీ, విజయ్ దళపతి, షారుఖ్ తో బిగ్ ప్రాజెక్ట్స్.? బాక్సాఫీస్ షేకే..

ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ (Atlee)  రాజా - రాణి చిత్రంతో డైరెక్టర్ గా పరిచయం అయిన విషయం తెలిసిందే. తొలి చిత్రంతోనే తన దర్శక ప్రతిభతో ఆకట్టుకున్నారు. దీంతో స్టార్ హీరోల చిత్రాలను డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నారు. 
 

26

‘తేరీ’, ‘అదిరింది’, ‘బిజిల్’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించి కోలీవుడ్ లో టాప్ దర్శకుడిగా ఎదిగారు. ఇక ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) తో ‘జవాన్’ తెరకెక్కించి బాలీవుడ్ లో అడుగుపెట్టారు. ప్రస్తుతం ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది. 
 

36

ఇప్పటికే థియేటర్, ఓటీటీ రైట్స్ లో రూ.900 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్టు తెలుస్తోంది. ఇక రెండో వారం పూర్తయ్యి భారీ మార్క్ ను చేరుకోనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలో అట్లీ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పైనా ఆసక్తి నెలకొంది. 
 

Related Articles

46

అయితే జవాన్ లో అల్లు అర్జున్, విజయ్ దళపతిలను గెస్ట్ రోల్స్ లో తీసుకుందామని అనుకున్నారు. కానీ ఆ విషయంలో అట్లీ తగ్గడానికి కారణం ఉంది. ఎందుకంటే.. బన్నీ, విజయ్ దళపతి పొటెన్షియల్ కు తగ్గట్టుగా బిగ్ ప్రాజెక్ట్స్ ను తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారంట. 
 

56

రీసెంట్ ఇంటర్వ్యూలో Jawan 2 ఉంటుందని కన్ఫమ్ చేశారు అట్లీ. విక్రమ్ రాథోడ్ పాత్ర ఆధారంగా తెరకెక్కించనున్నారంట.  అదీ గాక.. విజయ్ దళపతి (Vijay Thalapathy) - షారుఖ్ ఖాన్ తో మల్టీస్టారర్ ను కూడా ప్లాన్ చేస్తున్నారంట. భవిష్యత్ లో వారిద్దరికి సరిపోయే స్క్రిప్ట్ తో రావాల్సిన అవసరం ఉందని, అందుకే విజయ్ ను కామియో కోసం సంప్రదించలేదన్నారు. 

66

ఇక అల్లు అర్జున్ (Allu Arjun) తోనే అట్లీ నెక్ట్స్ ప్రాజెక్ట్ అంటూ వస్తున్న వార్తలు, సినీ వర్గాల్లో జరుగుతున్న చర్చలపైనా స్పందించినట్టు తెలుస్తోంది. బన్నీతో చేస్తే పాన్ ఇండియా స్థాయిలో భారీ స్క్రిప్ట్ తో రావాల్సి  ఉంటుందని, అందుకు తగ్గుట్టు ప్లాన్ చేయాలని చెప్పారు. దీనికి ఇంకాస్తా సమయం పడుతుందని అట్లీ వెల్లడించారు. 
 

Read more Photos on
Recommended Photos