టాప్ గ్లామర్ షోతో మైమరిపిస్తున్న అమలాపాల్.. మత్తు ఫోజులతో మలయాళీ బ్యూటీ రచ్చ

First Published | Sep 17, 2023, 11:27 AM IST

మలయాళ బ్యూటీ అమలాపాల్  (Amala Paul)  బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో నెట్టింట అందాల మత్తు జల్లుతోంది. అదిరిపోయే ఫోజులతో ఆకట్టుకుంటోంది. లేటెస్ట్ గా పంచుకున్న పిక్స్ తో అట్రాక్ట్ చేస్తోంది. 
 

మలయాళ బ్యూటీ అమలాపాల్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైన విషయం తెలిసిందే. ‘బెజవాడ’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఇక్కడ వరుస ఆఫర్లు అందుకుంది. 
 

‘నాయక్’, ‘ఇద్దరమ్మాయిలతో’ వంటి సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. తన పెర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఫిదా చేసింది. ఆ తర్వాత ‘జెండాపై కపిరాజు’, ‘పిట్ట కథలు’ వంటి సినిమాల్లో మెరిసింది. నటన పరంగా అదరగొట్టింది.


తెలుగులో ఈ ముద్దుగుమ్మ చేసినవి కొన్ని చిత్రాలే అయినా.. గుర్తుండిపోయే పాత్రలు పోషించింది. గ్లామర్ తోనూ వెండితెరపై మెరుపులు మెరిపించింది. విభిన్న పాత్రల్లో నటించి ఆకట్టుకుంది. 
 

కొన్నాళ్లుగా అమలాపాల్ లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూ వస్తోంది. ఆ మధ్యలో ‘ఆమె’, ‘పిట్టకథలు’ వంటి చిత్రాల్లో బోల్డ్ పెర్ఫామెన్స్ తోనూ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అందరినీ ఆశ్చర్యపరిచింది.
 

ఇప్పటికీ తన పాత్రకు ప్రాధాన్యమున్న చిత్రాల్లోనే నటిస్తోంది. తెలుగులో ఇప్పుడు ఎలాంటి ప్రాజెక్ట్స్ లేవు. మలయాళంలో ఆయా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలోనూ నిత్యం యాక్టివ్ గా కనిపిస్తోంది. 

కొన్నాళ్లు నెట్టింట అందాల విందు చేస్తూనే వస్తోంది. గ్లామర్ మెరుపులతో మైమరిపిస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ అందాల రచ్చ చేస్తోంది. తాజాగా పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి. 

లేటెస్ట్ పిక్స్ లో మత్తు ఫోజులతో మతులు పోగొట్టింది. కవ్వించే చేష్టలతో కుర్ర గుండెల్ని కొల్లగొడుతోంది. గుచ్చే చూపులతో కలవరపెట్టింది. క్యూట్ ఫొటోలకు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లూ ఫిదా అవుతున్నారు. 

ప్రస్తుతం ఈ ఫొటోలను లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. ఇక అమలాపాల్ మలయాళంలో ‘ఆడుజీవితం’, ‘ద్విజ’ తోపాటు మరో ప్రాజెక్ట్ లో నటిస్తోంది. ఇవన్నీ షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. రీసెంట్ గా అమలా ‘భోళా’లో స్పెషల్ అపియరెన్స్ తో అలరించింది. 
 

Latest Videos

click me!