అదే సమయంలో సినిమా కూడా మల్టీ స్పోర్ట్స్ ఫిల్మ్ అని, ఇందులో ఎమోషనల్ డ్రామా హైలైట్‌గా నిలుస్తుందని తెలుస్తుంది. అదే సినిమాకి బ్యాక్ బోన్ అని అంటున్నారు దర్శకుడు బుచ్చిబాబు. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్‌లో రా అండ్ రస్టిక్‌గా సినిమా సాగుతుందన్నారు. అయితే ఇందులో సిగరేట్ పాత్ర కీలకంగా ఉంటుందట.
మరి ఆ సిగరేట్ అలవాటు హీరోకి ఉంటుందా? అది కథని మలుపుతిప్పుతుందా? అనేది తెలియాల్సి ఉంది. రత్నవేల్ కెమెరామెన్‌గా పనిచేస్తున్న ఈ మూవీకి ఆస్కార్ విన్నర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే పాటల కంపోజింగ్ కూడా స్టార్ట్ చేశారు.