40 నిమిషాల్లో కృష్ణంరాజు నిర్ణయం మార్చేసిన ప్రభాస్.. లండన్ పంపిద్దాం అనుకుంటే..

First Published | Sep 21, 2024, 12:03 PM IST

ప్రభాస్ ఇంత పెద్ద స్టార్ అవుతాడని అతని కుటుంబ సభ్యులు కూడా ఊహించి ఉండరేమో. అసలు ప్రభాస్ కి నటనపై ఆసక్తి ఉందని కృష్ణంరాజుకు కూడా తెలియదట.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఇండియాలో బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్ అని చెప్పడంలో సందేహం లేదు. కొన్ని నెలల క్రితం విడుదలైన కల్కి 2898 ఎడి చిత్రం సంచలన విజయం సాధించింది. 1000 కోట్లకి పైగా వసూళ్లు సాధించింది. ప్రభాస్ ఇంత పెద్ద స్టార్ అవుతాడని అతని కుటుంబ సభ్యులు కూడా ఊహించి ఉండరేమో. 

Prabhas

అసలు ప్రభాస్ కి నటనపై ఆసక్తి ఉందని కృష్ణంరాజుకు కూడా తెలియదట. కృష్ణంరాజు ఇంట్లో జరిగిన ఫ్యామిలీ ఫంక్షన్ లో ప్రభాస్ కి సినిమాల పట్ల ఆసక్తి ఉందని మొట్ట మొదటి సారి కృష్ణంరాజుకు తెలిసింది. ఈ విషయాన్ని కృష్ణం రాజు స్వయంగా తెలిపారు. 

Also Read: శోభన్ బాబుని అలా చూడగానే కన్నీళ్లు వచ్చాయి..చిరు, బాలయ్య కంటే ఎక్కువగా..సీనియర్ హీరోయిన్ కామెంట్స్


ఆ ఫంక్షన్ లో అందరం సరదాగా డ్యాన్స్ చేస్తున్నాం. ప్రభాస్ నాతో 40 నిమిషాలు పోటీ పడి డ్యాన్స్ చేశాడు. అప్పటి వరకు ప్రభాస్ కి డ్యాన్స్ ఇంత బాగా వచ్చని నాకు కూడా తెలియదు. ఆ తర్వాత పక్కకి తీసుకెళ్లి అడిగా.. ఏంటి డ్యాన్స్ ఇంత బాగా చేస్తున్నావు .. సినిమాల్లోకి వస్తావా అని అడిగా.. ప్రభాస్ భయపడుతూ.. అవును పెదనాన్న.. నాకు ఇంట్రెస్ట్ ఉంది.. మీకు చెప్పడానికి భయం వేసింది అని చెప్పాడు. 

సరే.. నిన్ను లండన్ పంపించి యాక్టింగ్ స్కూల్ లో జాయిన్ చేస్తా.. యాక్టింగ్ బాగా నేర్చుకుని రా అని చెప్పా. ప్రభాస్ వెంటనే లండన్ వద్దు పెదనాన్న.. వైజాగ్ లో సత్యానంద్ గారు ఉన్నారు.. ఆయన దగ్గర నేర్చుకుంటా అని చెప్పాడు. వెంటనే ఒకే అన్నా. 

సత్యానంద్ దగ్గర జంతువులని ఇమిటేట్ చేస్తూ యాక్టింగ్ చేయడం లాంటివి బాగా నేర్చుకున్నాడు. అది చూసి ప్రభాస్ మంచి యాక్టర్ అవుతాడని నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ విధంగా ప్రభాస్ ని హీరోగా పరిచయం చేశాం అని కృష్ణంరాజు తెలిపారు. 

Latest Videos

click me!