ఆ బ్లాక్ బస్టర్ సినిమాకు ఎన్టీఆర్ పనికిరాడు అన్నారు, కట్ చేస్తే.. డైరెక్టర్ బయటపెట్టిన షాకింగ్ మేటర్!

First Published | Sep 21, 2024, 9:50 AM IST

జూనియర్ ఎన్టీఆర్ ఎంత గొప్ప నటుడో తెలిసిందే. అయితే ఓ సినిమాకు ఎన్టీఆర్ పనికిరాడని దర్శకుడికి అందరూ సలహా ఇచ్చారట. కట్ చేస్తే ఊహించని విజయం... 
 

ఎన్టీఆర్ దేశం మెచ్చిన నటుడు. డైలాగ్ డెలివరీ, డాన్సులలో ఆయనకు సాటిలేరు. ఎన్టీఆర్ ఏక సంధాగ్రాహి. ఎంత పెద్ద డైలాగ్ అయినా సింగిల్ టేక్ లో చెప్పేస్తాడట. కఠినమైన డాన్స్ మూమెంట్స్, ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా చేసేస్తాడట. ఈ విషయాన్ని పలువురు చిత్ర ప్రముఖులు వెల్లడించారు. 
 

junior ntr


బాలనటుడిగా సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైన ఎన్టీఆర్.. టీనేజ్ లోనే హీరో అయ్యాడు. 2001లో విడుదలైన నిన్ను చూడాలని హీరోగా మొదటి చిత్రం. ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఎన్టీఆర్ లుక్ సైతం నిరాశపరిచింది. 

అయితే రెండో చిత్రంతో సత్తా చాటాడు. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన స్టూడెంట్ నెంబర్ వన్ సూపర్ హిట్. ఈ చిత్రంలో ఎన్టీఆర్ డాన్సులు కట్టిపడేశాయి. పరిశ్రమకు మరో బెస్ట్ డాన్సర్ వచ్చాడని ఆడియన్స్ ఫిక్స్ అయ్యాడు. మూడో చిత్రం సుబ్బు మ్యూజికల్ హిట్. కమర్షియల్ గా ఆడలేదు. 
 


NTR

ఎన్టీఆర్ కి స్టార్డమ్ తెచ్చిన చిత్రం మాత్రం ఆది. ఎన్టీఆర్ కి ఇది నాలుగో చిత్రం. దర్శకుడు వివి వినాయక్ దర్శకుడిగా ఆదితో పరిచయం అయ్యాడు. 2002 మార్చి 28న విడుదలైన ఆది బ్లాక్ బస్టర్ హిట్. ఫ్యాక్షన్ కథలు వికటిస్తే సీనియర్ స్టార్స్ కి సైతం ప్లాప్స్ తప్పవు. అలాంటిది ఎన్టీఆర్ టీనేజ్ లోనే ఓ భారీ కథను హ్యాండిల్ చేశాడు. 

ఈ సినిమా విషయంలో జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను వివి వినాయక్ పంచుకున్నారు. వివి వినాయక్ కొత్త దర్శకుడు. ఒక ఫ్యాక్షన్ స్టోరీ రాసుకుని ఎన్టీఆర్ ని హీరోగా అనుకున్నాడు. చర్చలు కూడా పూర్తి అయ్యాయి. ఫ్యాక్షన్ స్టోరీకి ఎన్టీఆర్ వంటి ఓ కుర్ర హీరో ఎలా సెట్ అవుతాడని, పలువురు వివి వినాయక్ ని వద్ద అనుమానాలు వ్యక్తం చేశారట. 

NTR

ఎన్టీఆర్ ఆది కథకు సూట్ కాడు అన్నారట. ఒక స్టూడెంట్ ఫ్యాక్షనిస్ట్ గా మారితే ఎలా ఉంటుంది, అనేది ఈ కథ. కాబట్టి ఎన్టీఆర్ సెట్ అవుతాడని వివి వినాయక్ అన్నాడట. అప్పటికి ఎన్టీఆర్ కి మాస్ ఇమేజ్ లేదు. అందులో వివి వినాయక్ కొత్త దర్శకుడు. ఏదో ప్రయోగం చేస్తున్నారని అందరూ భావించారట. 

కట్ చేస్తే ఆది బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. 96 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఎన్టీఆర్ చెప్పిన ''అమ్మతోడు  అడ్డంగా నరికేస్తా'' డైలాగ్ విపరీతంగా పాప్యులర్ అయ్యింది. ఎల్బీ శ్రీరామ్, ఆలీ, చిత్రం శ్రీను కామెడీ ట్రాక్స్ నవ్వులు పూయిస్తాయి. మణిశర్మ సాంగ్స్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. 
 

NTR

ఆది విజయంతో ఎన్టీఆర్ స్టార్ హీరోల జాబితాలో చేరాడు. ఆయన మార్కెట్ విపరీతంగా పెరిగింది. ఇక 2003లో వచ్చిన సింహాద్రి మూవీతో ఎన్టీఆర్ ఇండస్ట్రీ హిట్ నమోదు చేశాడు. తిరుగులేని హీరోగా ఎదిగాడు. అనంతరం వరుస ప్లాప్స్ పడినా, ఎన్టీఆర్ ఇమేజ్ చెక్కు చెదరలేదు.  

2007లో యమదొంగ సినిమా విడుదలయ్యే వరకు ఎన్టీఆర్ కి హిట్ లేదు. రాజమౌళి ఎన్టీఆర్ ని హిట్ ట్రాక్ ఎక్కించాడు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కిన యమదొంగ ప్రేక్షకులను అలరించింది. ఎన్టీఆర్ స్లిమ్ లుక్ లో మెస్మరైజ్ చేశాడు. ఈ మూవీలో ఎన్టీఆర్ డాన్సులు ప్రత్యేక ఆకర్షణ. 
 

devara

ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ దేవర విడుదలకు సిద్ధం అవుతుంది. సెప్టెంబర్ 27న దేవర థియేటర్స్ లోకి వస్తుంది. దేవర ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ విరివిగా పాల్గొంటున్నారు. 

దర్శకుడు కొరటాల శివ దేవర చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. సైఫ్ అలీ ఖాన్ ప్రధాన విలన్ రోల్ చేస్తున్నాడు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. 

బిగ్ బాస్ హౌజ్ నుంచి మూడో వారం ఎగ్జిట్ అయ్యేది ఎవరు?

Latest Videos

click me!