శోభన్ బాబుని అలా చూడగానే కన్నీళ్లు వచ్చాయి..చిరు, బాలయ్య కంటే ఎక్కువగా..సీనియర్ హీరోయిన్ కామెంట్స్

First Published | Sep 21, 2024, 10:10 AM IST

శోభన్ బాబుతో ఎక్కువగా సినిమాలు చేసిన హీరోయిన్లలో సుహాసిని ఒకరు. సుహాసిని తాజాగా ఇంటర్వ్యూలో శోభన్ బాబు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఒకప్పుడు టాలీవుడ్ లో అందగాడు అంటే శోభన్ బాబు పేరే చెబుతారు. తన నటన, క్రమశిక్షణ, అందంతో శోభన్ బాబు చరిత్రలో నిలిచిపోయారు. మహిళా ప్రేక్షకుల ఆదరణ ఎక్కువగా పొందిన నటుడు ఆయన. హీరోయిన్లలో కూడా ఆయనకి చాలా మంది అభిమానులు ఉన్నారు. 

Sobhan Babu

శోభన్ బాబుతో ఎక్కువగా సినిమాలు చేసిన హీరోయిన్లలో సుహాసిని ఒకరు. సుహాసిని తాజాగా ఇంటర్వ్యూలో శోభన్ బాబు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సుహాసిని మాట్లాడుతూ నేను నాగార్జున, వెంకటేష్ ఇద్దరితో ఒక్కో చిత్రం మాత్రమే చేశాను. చిరంజీవి, బాలకృష్ణతో అయితే చాలా సినిమాలు చేశాను. అందరికంటే నేను ఎక్కువగా నటించింది శోభన్ బాబు గారితోనే అని సుహాసిని తెలిపింది. 


Sobhan Babu

మా ఇద్దరిదీ హిట్ పెయిర్. మొట్టమొదట శోభన్ బాబుతో నటించిన చిత్రం బావ మరదళ్ళు అని సుహాసిని తెలిపింది. ఇటీవల ఎవరో శోభన్ బాబు గారి ఫోటోని ఏఐ ద్వారా క్రియేట్ చేశారు. ఫారెన్ లో శోభన్ బాబు గారు యంగ్ లుక్ లో ఉన్నారు. ఆయన లుక్ ని చాలా మోడ్రన్ గా క్రియేట్ చేశారు. 

ఆ ఫోటో చూడగానే నాకు కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. ఆయన ఈ టైంలో ఉండి ఉంటే అంతే స్టైలిష్ గా.. అంతే అందంగా ఉంటారు. శోభన్ బాబు గారిని చాలా మిస్ అవుతున్నాం అని సుహాసిని ఎమోషనల్ అయ్యారు. బాలకృష్ణ, చిరంజీవి కంటే ఆయన తో నాకు ఎక్కువ బాండింగ్ ఉంది అని సుహాసిని పేర్కొంది. 

Suhasini

షూటింగ్ కి శోభన్ బాబు గారు కాస్త లేటుగా వస్తారు. ఆ విషయాన్ని ముందే చెబుతారు. నేను 40 నిమిషాలు లేటుగా వస్తా. నువ్వు కంగారు పడిపోయి వెంటనే వచ్చేయకు. కాస్త రిలాక్స్ అవ్వు అని చెప్పువారు. మతపరమైన విషయాలు చాలా చర్చించేవారు అని సుహాసిని పేర్కొంది. 
 

Latest Videos

click me!