రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణ వార్త టాలీవుడ్ మొత్తాన్ని దిగ్బ్రాంతికి గురిచేస్తోంది. సినీ రాజకీయ ప్రముఖులు కృష్ణం రాజు మృతి గురించి తెలియగానే విషాదంలో మునిగిపోయారు. 1940 జనవరి 20న జన్మించిన కృష్ణం రాజు అనారోగ్య సమస్యల కారణంగా ఆదివారం తెల్లవారుజామున మరణించారు. రెబల్ నెస్, మాస్ యాటిట్యూడ్ కి కొత్త నిర్వచనం చెబుతూ కృష్ణం రాజు సినిమాల్లో ఎన్నో విజయాలు అందుకున్నారు.