స్టార్స్ నిష్క్రమణలతో జబర్దస్త్ ఒకప్పటి శోభ కోల్పోయింది. వరుసగా రోజా, సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను, అనసూయ జబర్దస్త్ కి గుడ్ బై చెప్పేశారు. దీంతో ఈ లెజెండరీ కామెడీ షో టీఆర్పీ సగానికి పడిపోయింది. దీంతో నిర్వాహకులు నష్ట నివారణ చర్యలు చేపట్టారు.