శాఖాహారుల కోసం కూడా ప్రత్యేకమైన వంటకాలను ఏర్పాటు చేయించారు. వెజ్ వంటకాలతో పాటు స్వీట్లు కూడా చేయించారు. వీటిలో సాంబారు, రసం, పెరుగు చట్నీ, మిఠాయి, పూర్ణం, రోటీ, వెజ్ బిర్యానీ, పన్నీర్ కర్రీ, పప్పు, బెండకాయల వేపుడు వంటి వంటలు తయారు చేయించారు. దీంతో అభిమానులపై ప్రభాస్, క్రిష్ణం రాజు కుటుంబ సభ్యులు చూపిస్తున్న ప్రేమకు ఖుషీ అవుతున్నారు.