ప్రియురాలి మరణం గుర్తు చేసుకుని వెక్కి వెక్కి ఏడ్చిన 'ఢీ' పండు.. ఇద్దరి మీద కోపమే..

First Published | Sep 29, 2022, 1:49 PM IST

కొత్త కొత్త కాన్సెప్టులు తీసుకువస్తూ శ్రీదేవి డ్రామా కంపెనీ షోతో జబర్దస్త్ కమెడియన్లు ప్రేక్షకులని ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి మంగమ్మ గారి కొడుకు అనే కాన్సెప్ట్ తో ముందుకు వచ్చారు.

 కొత్త కొత్త కాన్సెప్టులు తీసుకువస్తూ శ్రీదేవి డ్రామా కంపెనీ షోతో జబర్దస్త్ కమెడియన్లు ప్రేక్షకులని ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి మంగమ్మ గారి కొడుకు అనే కాన్సెప్ట్ తో ముందుకు వచ్చారు. ఈ షోలో బుల్లితెర నటులు కూడా పాల్గొంటున్నారు. అప్పుడప్పుడూ ప్రముఖ నటులు కూడా మెరుస్తున్నారు. తాజాగా అక్టోబర్ 2న ప్రసారం కాబోయే శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో విడుదలయింది. 

ఈ షోలో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ కూడా పాల్గొంది. హైపర్ ఆది, పొట్టి నరేష్ తో కలసి స్కిట్ కూడా పెర్ఫామ్ చేసింది. హైపర్ ఆది, హేమ భార్య భర్తలుగా నటించారు. వారి కొడుకు గా పొట్టి నరేష్ పెర్ఫామ్ చేశాడు. హేమ వయసుపై హైపర్ ఆది వేసిన సెటైర్ మాములుగా పేలలేదు. 


ఏంట్రా మీ అమ్మ.. 70 ఏళ్ల వయసు వచ్చినా ఈ గౌనులు వేసుకోవడం మానలేదు అని హైపర్ ఆది అనడంతో నవ్వులు విరిశాయి. బుల్లితెర నటులు, జబర్దస్త్ కమెడియన్స్ లు తమ డ్యాన్స్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నారు. నూకరాజు తండ్రి కూడా ఈ షోలో స్కిట్ లో పాల్గొన్నాడు. 

ఇక ఢీ షోతో పాపులర్ అయిన పండు విషాద ప్రేమ గాధ ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. తన తల్లి గురించి, ప్రేయసి గురించి పండు వెక్కి వెక్కి ఏడుస్తూ పాట పాడాడు. పండు విషాద గాధ వింటూ ప్రతి ఒక్కరి కళ్ళలో నీళ్లు తిరిగాయి. 

నాకు ఊహ తెలియక ముందే మా అమ్మ చనిపోయింది. ఆ అమ్మాయి పరిచయం అయ్యాక ఆమెలో మా అమ్మని చూసుకున్నా. జీవితానంతం మీ అమ్మలాగా తోడు ఉంటా అని మాట ఇచ్చింది. కానీ నన్ను వదిలేసి మా అమ్మ దగ్గరికే వెళ్ళిపోయింది అంటూ పండు వెక్కి వెక్కి ఏడ్చాడు. 

అందుకే మా అమ్మపై, నా ప్రేయసిపై ఇద్దరిపై నాకు కోపంగా ఉంది అంటూ పండు ఎమోషనల్ అయ్యాడు. ఒకవైపు వినోదాన్ని అందిస్తూ మరోవైపు కంటతడి పెట్టించేలా ఉన్న ఈ ఎపిసోడ్ అక్టోబర్ 2న ప్రసారం కానుంది. 

Latest Videos

click me!