మురారి రీరిలీజ్..ఇందిరాగాంధీ శాపం కాదు, ఫస్ట్ మైండ్ లోకి వచ్చింది ఎన్టీఆర్.. పనిమనిషి శాపం గురించి కృష్ణవంశీ

First Published Jul 19, 2024, 2:31 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు మరికొన్ని రోజుల్లో తన 49 వ జన్మదిన వేడుకలకు సిద్ధం అవుతున్నారు. ఆగస్టు 9న మహేష్ పుట్టినరోజు వేడుకలు జరగనున్నాయి. ఈసారి మహేష్ బర్త్ డే వేడుకలు మోత మోగనున్నట్లు తెలుస్తోంది.మహేష్ బ్లాక్ బస్టర్ మూవీ మురారి రీ రిలీజ్ అవుతోంది. 

సూపర్ స్టార్ మహేష్ బాబు మరికొన్ని రోజుల్లో తన 49 వ జన్మదిన వేడుకలకు సిద్ధం అవుతున్నారు. ఆగస్టు 9న మహేష్ పుట్టినరోజు వేడుకలు జరగనున్నాయి. ఈసారి మహేష్ బర్త్ డే వేడుకలు మోత మోగనున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి సినిమాకి సంబంధించిన అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అదే విధంగా మహేష్ బ్లాక్ బస్టర్ మూవీ మురారి రీ రిలీజ్ అవుతోంది. 

దీనితో మురారి చిత్రానికి సంబంధించిన విశేషాలు వైరల్ అవుతున్నాయి. మురారి చిత్రం మహేష్ కెరీర్ లో ఒక క్లాసిక్ ని చెప్పొచ్చు. డైరెక్టర్ కృష్ణ వంశీ తన ప్రతిభ మొత్తం జోడించి ఈ చిత్రాన్ని కళాత్మకంగా తీర్చిదిద్దారు. శాపం కారణంగా వంశంలోని ప్రతి తరంలో ఒకరు చనిపోవడం అనే పాయింట్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. 

Latest Videos


Murari

ఇక సోనాలి బింద్రే, మహేష్ మధ్య కెమిస్ట్రీ అయితే నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది. కృష్ణ వంశీ ఎంచుకున్న కథపై అప్పట్లో అనేక ప్రచారాలు జరిగాయి. ఈ చిత్రానికి ఇందిరాగాంధీ కుటుంబానికి లింక్ ఉన్నట్లు కూడా ప్రచారం జరిగింది. దీనిపై ఓ ఇంటర్వ్యూలో కృష్ణ వంశీ స్పందించారు. 

Murari

కృష్ణ వంశీ మాట్లాడుతూ మురారి చిత్ర నిర్మాత రామలింగేశ్వర రావు కృష్ణ గారికి బాగా క్లోజ్. అప్పటికి మహేష్ బాబు తన ఫస్ట్ మూవీ మాత్రమే కంప్లీట్ చేసి ఉన్నాడు. ఆయన వెళ్లి కృష్ణ గారిని అడిగారు. మహేష్ తో సినిమా చేయాలి అంటే వెళ్లి డైరెక్టర్ ని తెచ్చుకో అని చెప్పారు. రామలింగేశ్వర రావు నా దగ్గరికి వచ్చి మహేష్ బాబుతో సినిమా చేయాలి అని అడిగారు. నేను ప్రస్తుతం బిజీగా ఉన్నాను. ఒక సినిమా పూర్తయ్యాకే మరో సినిమా చేస్తాను అని చెప్పాను. 

ఆయన వెళ్లి కృష్ణ గారికి చెప్పారు. అయితే మరో డైరెక్టర్ తో చేద్దాం. డైరెక్టర్ ఎవరో నేను చెబుతా అని కృష్ణ అన్నారు. రామలింగేశ్వర రావు గారు.. లేదు సర్ నేను కృష్ణవంశీతోనే చేస్తాను అని చెప్పారు. మహేష్ బాబు మూడు చిత్రాలు చేసిన తర్వాత మా కాంబినేషన్ సెట్ అయింది. మహేష్ బాబుతో సినిమా అనగానే నా మైండ్ లోకి వచ్చిన ఫస్ట్ థాట్.. శ్రీకృష్ణుడు బృందావనంలో ఉన్నట్లుగా ఒక అందమైన సినిమా చేయాలి అని అనుకున్నా. 

మహేష్ బాబుని చూడగానే కుర్ర శ్రీకృష్ణుడిలా చూపించాలి అనుకున్నా. కృష్ణుడు బృందావనంలో గోపికలతో రాగాలు తీయడంపై కొంతమంది కొన్ని నవలలు రాశారు. ఆ నవలలు చదివాను. అది చాలదు అన్నట్లు ఎన్టీఆర్ గారు కృష్ణుడిగా నటించిన సినిమాలన్నీ వరుసపెట్టి చూశాను. అప్పటికి ఇందిరాగాంధీ శాపం శాపం గురించి, కథ గురించి ఆలోచించలేదు. కేవలం మహేష్ బాబుని ఎలా చూపించాలి అనే విషయం గురించే ఆలోచిస్తున్నా అని తెలిపారు. 

ఒకరోజు నా ఫ్రెండ్స్ తో కారులో గోదావరి జిల్లాలలో తిరుగుతున్నా. మేము సరదాగా రాజకీయాల గురించి మాట్లాడుకుంటూ ఉండగా ఒక ఫ్రెండ్ ఇందిరాగాంధీ కుటుంబానికి ఉన్న శాపం గురించి చెప్పాడు. ఫిరోజ్ గాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ ఇలా అందరివీ వారి కుటుంబంలో అసహజ, అకాల మరణాలే. చాలా దారుణంగా జరిగాయి అని చెప్పారు. 

ఆ తర్వాత మరో ఇన్సిడెంట్ తెలిసింది.. కృష్ణ జిల్లాలో ఒక పెద్ద ఎంపీ కుటుంబంలో ముగ్గురు కొడుకులు నెలల వ్యవధిలో చనిపోయారు. పనిమనిషి పెట్టిన శాపం అంటూ ప్రచారం జరిగింది. ఇక శ్రీకృష్ణుడు పుట్టుక నుంచి కష్టాలే. కృష్ణుడి కన్నా ముందు 7 గురు పుడితే అందరిని కంసుడు చంపేశాడు. కృష్ణుడు మాత్రం బ్రతికాడు. ఆ విధంగా మహేష్ బాబుని కృష్ణుడితో పోలినట్లుగా.. ఫ్యామిలీని ఇందిరాగాంధీ కుటుంబం అన్నట్లుగా కథని తయారు చేసాం అని కృష్ణవంశీ అన్నారు. 

click me!