ఇదిలా ఉండగా ఎన్టీఆర్ దేవర చిత్రం సెప్టెంబర్ 27న రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇక ఉన్నది రెండు నెలల సమయం మాత్రమే. దేవర చిత్రం 400 కోట్ల భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం. ఇప్పటి వరకు ఒక టీజర్, ఒక సాంగ్ తప్ప ఇతర అప్డేట్ లేదు. సినిమా ఎంతవరకు పూర్తయింది ? పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఎంతవరకు వచ్చింది ? ఇలాంటి అంశాలపై చిత్ర యూనిట్ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. దీనితో తారక్ ఫ్యాన్స్ లో చిన్నపాటి కంగారు మొదలైంది. పుష్ప 2 తరహాలో రూమర్స్ రాకుండా చిత్ర యూనిట్ ఏదో ఒక అప్డేట్ ఇవ్వాలని గోల చేస్తున్నారు.