ఒకే సినిమాలో 14మంది హీరోలా? 12 మంది హీరోయిన్లు.. వామ్మో చూడ్డానికి రెండు కళ్లు చాలవు? ఆ మూవీ ఏంటో తెలుసా?

Published : Jul 19, 2024, 12:14 PM ISTUpdated : Jul 19, 2024, 01:38 PM IST

14 మంది హీరో, 12 మంది హీరోయిన్లు, 19 మంది దర్శకులు పనిచేసిన సినిమా ఏంటో తెలుసా? ఒక్క రోజులో షూటింగ్‌.. ఏకంగా గిన్నిస్‌ రికార్డు కొట్టేశారే?  

PREV
16
ఒకే సినిమాలో 14మంది హీరోలా? 12 మంది హీరోయిన్లు.. వామ్మో చూడ్డానికి రెండు కళ్లు చాలవు? ఆ మూవీ ఏంటో తెలుసా?

ఒక సినిమాలో ఒక హీరో ఉంటే అది కామన్‌, ఇద్దరు ఉంటే మల్టీస్టారర్. అది స్పెషల్‌గా నిలుస్తుంది. ముగ్గురు హీరోలుంటే అది పెద్ద ట్రీటే. అలాంటిది 14 మంది హీరోలంటే మాటలా? వామ్మో ఆ సినిమా చూడ్డానికి రెండు కళ్లు చాలవని చెప్పొచ్చు. ఇదే అనుకుంటే 12 మంది హీరోయిన్లు నటిస్తే ఇక ఆడియెన్స్ కి పండగే పండగ. అలాంటి అరుదైన విషయం ఓ సినిమా విషయంలో జరిగింది. అదే గిన్నిస్‌ రికార్డుని సొంతం చేసుకుంది. 
 

26

మరి ఇంతకి ఆ సినిమా ఏంటీ అనేది చూస్తే.. ఇది తమిళంలో రూపొందిన `సుయంవరం` మూవీ కావడం విశేషం. ఇది 1999లో విడుదలైంది. తమిళంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో `పెళ్లంటే ఇదేరా` పేరుతో డబ్‌ చేసి రిలీజ్‌ చేశారు. ఇందులో 14 మంది హీరోలు నటించారు. సత్యరాజ్‌ అప్పట్లో కోలీవుడ్‌లో పెద్ద స్టార్‌ హీరో. ఆయనతోపాటు ప్రభు హీరోగా చేస్తున్నారు. ఇక అబ్బాస్‌, వినీత్‌, అర్జున్‌, ప్రభుదేవా, కార్తీక్‌, పార్థిబన్‌ తోపాటు ఇతర కోలీవుడ్‌ హీరోలంతా కనిపించారు. 
 

36

వీరితోపాటు 12 మంది హీరోయిన్లు ఇందులో కనిపించడం విశేషం. వారిలో రంభ, రోజా, మహేశ్వరి, ఖుష్బూ, హీరా, దేవయాని, ఐశ్వర్య కస్తూరి వంటి కోలీవుడ్‌ భామలు ఇందులో మెరిశారు. అందాల విందుతో అలరించారు. 14 మందికి 12 మంది హీరోయిన్లు మెరిసి ఆకట్టుకున్నారు. దీంతో అప్పట్లో ఈ మూవీ సంచలనంగా మారింది. అయితే ఈ సంచలనం వెనుక అనేక ఇంట్రెస్టింగ్‌ ఎలిమెంట్లు కూడా ఉన్నాయి. అవేంటో చూస్తే.. 
 

46

ఈ సినిమాని కేవలం ఒక్క రోజులోనే షూట్‌ చేశారు. ఇంకా చెప్పాలంటే జస్ట్ 23 గంటల్లో షూట్‌ చేశారట. మార్చి 24న షూటింగ్‌ ప్రారంభించిన ఈ మూవీని ఒక్క రోజుకి ఒక్క గంట ముందే పూర్తి చేశారు. ముందస్తుగా పక్కా ప్లానింగ్‌తో ఈ సినిమాని షూట్‌ చేయడం విశేషం. అంతేకాదు దీనికోసం ఏకంగా 14 మంది డైరెక్టర్లు పనిచేశారట. సుందర్‌ సీ, కేఎస్‌ రవికుమార్‌, పి వాసు, అర్జున్‌తోపాటు తమిళ దర్శకులు చాలా మంది దీనికి పని చేశారు. ఓ ప్రయోగాత్మకంగా దీన్ని రూపొందించడం విశేషం. 

56

అలాగే ఈసినిమా కోసం 19 మంది కెమెరామెన్లు, అసోసియేట్‌ డైరెక్టర్లు, 45 మంది అసిస్టెంట్ డైరెక్టర్లు, 145 మంది డాన్సర్లు, పని చేశారు. ఇందులో కొరియోగ్రాఫర్‌ ప్రభుదేవా ఓ పాట కూడా పాడారు. సినిమాని ఓ డిఫరెంట్‌ వేలో షూట్‌ చేశారు. మొత్తం స్క్రిప్ట్ ని 11 భాగాలుగా చేసి షూటింగ్‌ చేశారట. ఒక్కో హీరో హీరోయిన్‌, దర్శకుడు, కెమెరామెన్ ఇద్దరు ముగ్గురు అసిస్టెంట్లు ఒక టీమ్‌గా విడిపోయి, మొత్తం 19 టీములుగా ఏర్పడి చెన్నైలోని వివిధ ప్రాంతాల్లో ఏకకాలంలో షూటింగ్‌ స్టార్ట్ చేసి కంప్లీట్‌ చేయడం మరో విశేషం.
 

66

`సుయంవ‌రం` మూవీ 1999 జూలై 16న రిలీజై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న‌ది. ఒకే సినిమాలో 26 మంది హీరోహీరోయిన్ల నటించడంతో ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్‌గా ఆ మూవీ నిలిచింది. చూసిన ఫ్యాన్స్ ఓ పండగా ఫీలయ్యారు. ఈ సినిమా తెలుగులో `పెళ్లంటే ఇదేరా `పేరుతో అనువాదం చేసి విడుదల చేశారు. ఇక్కడ కూడా మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా కథేంటనేది చూస్తే, ఫ్యామిలీ ఎమోష‌న్స్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. కుసేల‌న్‌కు ముగ్గురు కొడుకులు, ఆరుగురు కూతుళ్లు ఉంటారు. హార్ట్ ఎటాక్ కార‌ణంగా కుచేల‌న్ చావు బతుకుల్లో ఉంటాడు. తాను బ‌తికుండ‌గానే కొడుకులు, కూతుళ్ల పెళ్లి చూడాల‌ని అనుకుంటాడు. తండ్రి కోరిక‌ను ఆ కొడుకులు, కూతుళ్లు ఎలా నెర‌వేర్చారు అనే క‌థాంశంతో తెరకెక్కిన చిత్రమిది. ఈ మూవీ గిన్నిస్‌ రికార్డు సొంతం చేసుకోవడం విశేషం.   
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories