మోడీగారు మీ సినిమా పేరు పెట్టారు.. ఖడ్గానికి సిందూరం, నెటిజన్ ప్రశ్నకి కృష్ణవంశీ సమాధానం ఇదే

tirumala AN | Published : May 8, 2025 10:01 AM
Google News Follow Us

పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై ఇండియా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత కొన్ని చిత్రాల గురించి కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా మిలిటరీ ఆపరేషన్ సంబంధించిన చిత్రాలు వైరల్ అవుతున్నాయి. 

15
మోడీగారు మీ సినిమా పేరు పెట్టారు.. ఖడ్గానికి సిందూరం, నెటిజన్ ప్రశ్నకి కృష్ణవంశీ సమాధానం ఇదే
Krishna Vamsi

పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై ఇండియా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత కొన్ని చిత్రాల గురించి కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా మిలిటరీ ఆపరేషన్ సంబంధించిన చిత్రాలు వైరల్ అవుతున్నాయి. అయితే క్రియేటివ్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన కృష్ణవంశీ తెరకెక్కించిన చిత్రాలు గురించి నెటిజన్లు ఎక్కువగా చర్చించుకుంటున్నారు.

25

సిందూరం అనే టైటిల్ తో కృష్ణవంశీ 1997లో రవితేజ, బ్రహ్మాజీ, సంఘవి ప్రధాన పాత్రల్లో ఓ చిత్రాన్ని రూపొందించారు.  సిందూరం మూవీ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినప్పటికీ కృష్ణవంశీ బెస్ట్ మూవీస్ లో అది కూడా ఒకటిగా ఉంటుంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత నెటిజన్లు ఈ చిత్ర పోస్టర్లను వైరల్ చేస్తే కృష్ణవంశీకి ట్యాగ్ చేస్తున్నారు.
 

35
Krishna vamsi

దీంతో కృష్ణవంశీ తనదైన శైలిలో అభిమానులకు రిప్లై ఇస్తున్నారు. ఓ నెటిజన్ 'ఆలోచనల్లో కృష్ణవంశీ అందరికంటే ముందుంటారు' అని సింధూరం చిత్ర పోస్టర్ ని, ఆపరేషన్ సిందూర్ తో కలిపి పోస్ట్ చేశారు. కృష్ణవంశీ వందేమాతరం అని రిప్లై ఇచ్చారు. మరో నెటిజన్ ఇండియన్ ఆపరేషన్ కి మీ సినిమా పేరు పెట్టారు ఎలా అనిపిస్తుంది ప్రశ్నించాడు. కృష్ణవంశీ సమాధానం ఇస్తూ.. పర్ఫెక్ట్ నేమ్.. మోడీ గారి రియల్ హీరో.. ఇండియన్ ఆర్మీ కి నా సెల్యూట్.. వందేమాతరం.. ఐ లవ్ భారత్ అని సమాధానం ఇచ్చారు.
 

45
Krishna vamsi

మరో నైటిజన్ మీ ఖడ్గానికి మన ఆర్మీ  సిందూరం అద్దారు అని కామెంట్ చేయగా.. జైహింద్ మోడీ గారికి ఇండియన్ ఆర్మీకి నా కృతజ్ఞతలు.. వాళ్లని చూస్తే గర్వంగా ఉంది.. వందేమాతరం అని సమాధానం ఇచ్చారు.
 

55
Krishna vamsi

ఆపరేషన్ సింధూర తర్వాత.. కృష్ణవంశీ రూపొందించిన  సిందూరం, ఖడ్గం చిత్రాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశం కావడం విశేషం. సిందూరం చిత్రం నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో రూపొందింది. ఖడ్గం మూవీ అయితే ఇండియా పాక్ గొడవలు, ఉగ్రవాదం నేపథ్యంలో కృష్ణవంశీ అద్భుతంగా తెరకెక్కించారు.

 

Read more Photos on
Recommended Photos