2016లో మిస్ సూపర్ నేషనల్ కిరీటాన్ని దక్కించుకున్న శ్రీనిధి శెట్టి మోడలింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. కానీ ఈ మంగళూరు భామకు పేరు తెచ్చింది కేజీఎఫ్.
28
పాన్ ఇండియా సినిమాగా పేరు తెచ్చుకున్న కన్నడ బ్లాక్ బస్టర్ కేజీఎఫ్ 1, 2లో రీనా దేశాయ్ పాత్రలో నటించిన శ్రీనిధి శెట్టి తొలి సినిమాతోనే పాపులారిటీ సంపాదించారు.
38
తమిళంలో విక్రమ్‌తో కలిసి కోబ్రా సినిమాలో నటించారు. రీసెంట్ గా నాని హిట్ 3లో నటించిన మరో సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది.
హిట్ 3 ప్రమోషన్‌లో భాగంగా ఇంటర్వ్యూలో 14 ఏళ్ల వయసులో తల్లిని కోల్పోయిన విషయాన్ని వెల్లడించి భావోద్వేగానికి గురయ్యారు.
58
శ్రీనిధి శెట్టి తన తండ్రి గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు. ఇన్‌స్టాలో కూడా తండ్రితో ఉన్న ఫోటోలే ఎక్కువ. తల్లి గురించి మాత్రం తక్కువగా మాట్లాడతారు.
68
10వ తరగతిలో ఉన్నప్పుడు తల్లిని కోల్పోయానని, ఆ సమయంలో దేవుడిపై నమ్మకం సడలిందని, అందరి నుంచి దూరంగా ఉండాలని అనిపించిందని శ్రీనిధి చెప్పారు.
78
ఇంట్లో ఉండాలని అనిపించకపోవడంతో బెంగళూరుకు వచ్చేశానని, కొత్త వాతావరణంలో గతాన్ని మరచిపోవాలని చూశానని శ్రీనిధి అన్నారు.
88
బెంగళూరు వచ్చాక శ్రీనిధి జీవితం మారిపోయింది. జైన్ కాలేజీలో ఇంజినీరింగ్, ఆ తర్వాత మోడలింగ్, సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నారు.