మహేష్ బాబు మూవీ సూపర్ హిట్, నాకూ అలాంటిదే కావాలన్న ఎన్టీఆర్.. అందుకే తేడా కొట్టిందా ?

First Published | Aug 8, 2024, 7:54 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఆగష్టు 9న తన జన్మదిన వేడుకలు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా మహేష్ కెరీర్ లో మెమొరబుల్ మూవీ మురారి చిత్రం రీరిలీజ్ అవుతోంది.

Krishna Vamsi interesting comments on NTR and Rakhi movie dtr

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఆగష్టు 9న తన జన్మదిన వేడుకలు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా మహేష్ కెరీర్ లో మెమొరబుల్ మూవీ మురారి చిత్రం రీరిలీజ్ అవుతోంది. సోషల్ మీడియాలో మురారి చిత్రానికి సంబంధించిన విశేషాలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. 

డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పటికి ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరిస్తూ ఉంటుంది. కృష్ణవంశీ టాలీవుడ్ లో మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, రాంచరణ్ లాంటి స్టార్స్ తో సినిమా చేశారు. కుటుంబ బంధాలని, భావోద్వేగాల్ని హైలైట్ చేస్తూ తెరకెక్కించడం కృష్ణవంశీ స్టైల్. 


ఫ్యామిలీ ఆడియన్స్ లో ఇమేజ్ రావాలంటే కృష్ణవంశీతో సినిమా చేయాలనే ప్రచారం ఉంది. అదే విధంగా కృష్ణవంశీ ఖడ్గం లాంటి దేశభక్తి చిత్రం కూడా తెరకెక్కించారు. కృష్ణవంశీ ఎన్టీఆర్ తో సినిమా చేద్దాం అని అనుకున్నప్పుడు ఆసక్తికర సంఘటన జరిగిందట. 

ఎన్టీఆర్ కి మహేష్ బాబు మురారి చిత్రం అంటే చాలా ఇష్టం. కలిసిన ప్రతిసారి నాకు మురారి లాంటి మూవీ కావాలి అని అడిగేవాడు. కానీ నేను రాఖీ కథ చెప్పి నీకు ఈ సినిమా కరెక్ట్ అని కన్విన్స్ చేసినట్లు కృష్ణ వంశీ పేర్కొన్నారు. రాఖి చిత్రం జస్ట్ ఒకే అనిపించింది. అంతే కానీ అద్భుతంగా అయితే కాలేకపోయింది. 

ఆ మూవీలో ఎన్టీఆర్ కాస్ట్యూమ్స్, బాడీ, హెయిర్ స్టైల్ పై ఎక్కువగా విమర్శలు వచ్చాయి. కథలో సెంటిమెంట్ ఓవర్ అయిందనే కామెంట్స్ కూడా వచ్చాయి. మొత్తంగా కృష్ణ వంశీ ఎన్టీఆర్ కోరుకున్నట్లు మురారి లాంటి సినిమా చేయలేదు. తాను కథని హీరోల బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్లుగా ప్రిపేర్ చేస్తానని కృష్ణవంశీ అన్నారు. 

Latest Videos

click me!