అరవైపు ఇంకా లాభం లేదు కన్న కూతుర్నే వదులుకున్నాను అలాంటిది బయట పిల్లని వదులుకోవడం లెక్క కాదు అంటుంది భవాని. కానీ మురారి అని ఈశ్వర్ అంటుండగానే ఎవరేమైపోతే మనకెందుకు.. పేరుకే పెంచిన తల్లి కానీ చాలా పవర్ ఫుల్ అని భవాని వెనుకగా ఉన్న యశోద కృష్ణుల ఫోటో చూస్తూ భవాని వినబడేలాగా మాట్లాడుతుంది కృష్ణ. నువ్వు పెంచిన కొడుకే కదా మన్ను తిన్నా ఆ కృష్ణుడే, వెన్న తిన్న ఆ కృష్ణుడే కాస్త దయ తలచి కనికరం చూపించొచ్చు కదా, గోకులంలో నువ్వు, ద్వారకలో కన్నతల్లి ఎవరూ మాట్లాడకపోతే మోము వాడిపోయి కూర్చున్న కృష్ణయ్యని చూడండి అని వేడుకుంటుంది కృష్ణ.