ట్రెడిషనల్ లుక్ లోనూ నేహా శర్మ మెరుపులు.. మత్తు కళ్లతో మైమరిపిస్తున్న రామ్ చరణ్ హీరోయిన్..

First Published | Apr 29, 2023, 12:05 PM IST

రామ్ చరణ్ హీరోయిన్ నేహా శర్మ (Neha Sharma) బ్యూటీఫుల్ లుక్ తో కట్టిపడేస్తోంది. ట్రెడిషనల్ వేర్ లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ తన అందంతో ఆకట్టుకుంటోంది. లేటెస్ట్ పిక్స్ వైరల్ గా మారాయి. 
 

నార్త్ బ్యూటీ, యంగ్ హీరోయిన్  నేహా శర్మ  ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాల్లోనే నటిస్తోంది. అప్పుడప్పుడు సౌత్ చిత్రాల్లోనూ మెరుస్తున్న ఈ ముద్దుగుమ్మ ఎక్కువగా హిందీ సినిమాలకే ప్రాధాన్యత ఇస్తోంది. ఇక తెలుగులో ఈ బ్యూటీ  రెండు చిత్రాల్లో అలరించిన విషయం తెలిసిందే. 
 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) సరసన నేహా శర్మ ‘చిరుత’లో నటించింది. అటు చరణ్ కు, ఇటు నేహాకు ఇదే ఫస్ట్ సినిమా. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వీరిద్దరూ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. తొలిచిత్రంతోనే హిట్ అందుకున్నారు. ఆడియెన్స్ లోనూ మంచి క్రేజ్ దక్కించుకున్నారు. 
 


ఈ చిత్రం తర్వాత నేహా ‘కుర్రాడు’ చిత్రంలో నటించింది. ఆ తర్వాత బాలీవుడ్ లో అడుగుపెట్టి అక్కడే సినిమాలు చేస్తోంది. ఐదేండ్ల కింద మలయాళం, తమిళంలోనూ రెండు చిత్రాల్లో మెరిసింది. ఇక టాలీవుడ్ నుంచి మాత్రం ఎలాంటి ఆఫర్లను అందుకోవడం లేదు. 

ప్రస్తుతం రొమాంటిక్ కామెడీ హిందీ ఫిల్మ్ ‘జోగిరా సార రారా’ (Jogira Sara Ra Ra)లో బాలీవుడ్ ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ (Nawazuddin Siddiqui) సరసన నటించింది. గతేడాది ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధమైంది. మే12న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు. 
 

ప్రచార కార్యక్రమాల్లో భాగంగా నేహా శర్మ  మీడియా కంట్లో పడుతోంది. అలాగే సోషల్ మీడియాలోనూ మరింత యాక్టివ్ గా కనిపిస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ ఆకట్టుకుంటోంది. నెట్టింట వరుసగా గ్లామర్ మెరుపులు మెరిపిస్తున్న   ముద్దుగా తాజాగా మరిన్ని ఫొటోలను పంచుకుంది.

గ్రీన్ డ్రెస్ లో నేహా శర్మ బ్యూటీఫుల్ గా మెరిసింది. క్రాప్డ్ టాప్, ట్రౌజర్, ఫుల్ స్లీవ్ ధరించి ట్రెడిషనల్ లుక్ లో ఆకట్టుకుంది. సోఫాలపై కూర్చొని అదిరిపోయేలా ఫోజులిచ్చింది. మరోవైపు క్లీవేజ్     షోతోనూ మతులు పోగొట్టింది. గుచ్చే చూపుతో మత్తెక్కించేసింది. ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. నేహాను పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. 
 

Latest Videos

click me!