కన్నుల పండుగలా 'కృష్ణ ముకుంద మురారి' నటి ప్రేరణ వివాహం..చూడ ముచ్చటగా కొత్త జంట, పెళ్లి ఫోటోలు వైరల్

First Published | Nov 24, 2023, 12:15 AM IST

ప్రేరణ కృష్ణ ముకుంద మురారి టివి సీరియల్ లో నటిస్తూ గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటూ ఉంటుంది. అయితే ప్రేరణ తాజాగా శ్రీపాథ్ దేశ్ పాండే అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. 

బుల్లితెర నటీనటులు పెళ్లి సంబరాల్లో మునిగితేలుతున్నారు. ఒక వైపు బుల్లితెర క్రేజీ నటుడు మానస్ వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. మరో వైపు కృష్ణ ముకుంద మురారి టీవీ సీరియల్ నటి ప్రేరణ కూడా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. 

ప్రేరణ కృష్ణ ముకుంద మురారి టివి సీరియల్ లో నటిస్తూ గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటూ ఉంటుంది. అయితే ప్రేరణ తాజాగా శ్రీపాథ్ దేశ్ పాండే అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. 


ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇద్దరూ సాంప్రదాయ వస్త్ర ధారణలో మెరిసిపోతున్నారు. దీనితో అభిమానులంతా ఇద్దరికీ శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ లు చేస్తున్నారు. 

బుల్లితెర ప్రేక్షకులు చాలా మంది ప్రేరణ నటనకు ఫిదా అవుతుంటారు. బుల్లితెర అభిమానులు, మహిళలు ప్రేరణకు మ్యారేజ్ విషెష్ చెబుతున్నారు. జంట చూడ ముచ్చటగా ఉందని కొనియాడుతున్నారు. 

ప్రేరణ పట్టు చీరలో, ఆభరణాలతో మెరిసిపోతోంది. శ్రీపాథ్ పంచె కట్టులో కనిపిస్తున్నాడు. బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్ళి వేడుక ఘనంగా జరిగింది. 

బెంగుళూరులోని ఓ ప్రైవేట్ రిసార్ట్ లో వీరి వివాహ వేడుక జరిగింది. అయితే వీరిద్దరిది ప్రేమ వివాహమా లేక పెద్దలు కుదిర్చిన పెళ్లా అనేది క్లారిటీ లేదు. 

Latest Videos

click me!