Krishna Mukunda Murari: పశ్చాతాపంతో కుమిలిపోతున్న కృష్ణ.. జరగబోయే దాని గురించి అయోమయంలో ఉన్న మురారి!

Published : May 04, 2023, 02:30 PM IST

Krishna Mukunda Murari: స్టార్ మాలో ప్రసారం అవుతున్న కృష్ణ ముకుంద మురారి సీరియల్ మంచి కథ కథనాలతో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. ప్రేమ కోసం పిచ్చిదైపోయిన ఒక అమాయకురాలి ప్రేమ కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 4 ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూద్దాం.  

PREV
19
Krishna Mukunda Murari: పశ్చాతాపంతో కుమిలిపోతున్న కృష్ణ.. జరగబోయే దాని గురించి అయోమయంలో ఉన్న మురారి!

ఎపిసోడ్ ప్రారంభంలో వాచ్ ని సరి చేయటానికి స్టూల్ ఎక్కి అక్కడ నుంచి పడిపోబోతుంది కృష్ణ. మురారి పడిపోకుండా అడ్డుకుంటాడు. ఏంటీ సాహసాలు అంటాడు మురారి. టైము మార్చుదామని అంటుంది కృష్ణ. ఏం చేసినా నా టైం మారదు కదా అని దిగులుగా చెప్తాడు మురారి. ఒక ప్లాన్ ఫెయిల్ అయితే ఏమైంది మరొక ప్లాన్ వేద్దాం డ్యూడ్ అంటుంది కృష్ణ.

29

ఆ మాటలకి నవ్వుతాడు మురారి నన్ను డ్యూడ్ అనాలని ఎందుకు అనిపించింది అంటాడు. మీరంటే బోల్డంత గౌరవం అందుకే అలా అన్నాను అంటుంది కృష్ణ. ప్రేమతో అన్నాను అనొచ్చు కదా.. ఆ మాట కోసం ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలో అనుకుంటాడు మురారి. మరోవైపు కృష్ణ దగ్గరికి వెళ్లడానికి మారం చేస్తుంది నందిని. అక్కడ కృష్ణ తో పాటు మీ అమ్మ, బాబాయిలు కూడా ఉంటారు అంటాడు గౌతమ్. 

39

అమ్మో వద్దు వాళ్లు నిన్ను చంపేస్తారు. వాళ్లని ఇక్కడికి రమ్మందాము అంటుంది నందిని. సరే నేను ఫోన్ రేపు రమ్మని చెప్తాను అంటూ నందినికి సర్ది చెప్తాడు గౌతమ్. మరోవైపు పెద్ద క్యారియర్ తీసుకొని వస్తుంది కృష్ణ. ఇదంతా ఎందుకు నేను ఏసీపిని ఫిజిక్ మెయింటైన్ చేయాలి కానీ క్యారియర్ ని కాదు అంటాడు మురారి. మీకోసం కష్టపడి ఇవన్నీ చేస్తే వద్దంటారా మనల్ని భోజనం పెట్టకుండా ఆపిన వాళ్లకి ఇదొక గుణపాఠం అవ్వాలి అంటుంది కృష్ణ.

49

మరి నీ క్యారియర్ ఏది అని అడుగుతాడు మురారి. ఒక చిన్న టిఫిన్ బాక్స్ చూపిస్తుంది కృష్ణ. నీకు చిన్న బాక్సు నాకు మాత్రం బుట్ట అంత క్యారియర్ అంటాడు మురారి. అవును మరి మీరు చెట్టు అంతా ఉన్నారు కదా అని నవ్వుతుంది కృష్ణ. మురారి కూడా శృతి కలుపుతాడు. మరోవైపు హాస్పిటల్ కి వచ్చిన కృష్ణకి వాళ్ళ ఊరి వ్యక్తి కనిపిస్తాడు. ఎలా ఉన్నావు బాబాయ్ అంటూ కుశల ప్రశ్నలు వేస్తుంది.

59

కృష్ణ నువ్వు ఇక్కడ పని చేస్తున్నావా.. బాగున్నావా? అని అతను కూడా కుశల ప్రశ్నలు వేస్తాడు. నువ్వేంటి బాబాయ్ ఇక్కడికి వచ్చావు అని అడుగుతుంది కృష్ణ. తన కొడుక్కి బాగోకపోతే ఇక్కడికి వచ్చానని చెప్పడంతో అతడిని పరీక్షిస్తుంది కృష్ణ. తన సీనియర్ ని కూడా తీసుకువచ్చి చూపిస్తుంది. అతను బాబు కండిషన్ సీరియస్ గా ఉంది అని చెప్పటంతో అప్పటికప్పుడే ఆపరేషన్ చేస్తారు.

69

బాబుకి ప్రమాదం తప్పిందని సీనియర్ డాక్టర్ చెప్పటంతో అదే విషయాన్ని ఆనందంగా వాళ్ళ బాబాయ్ కి చెప్తుంది కృష్ణ. నువ్వు నిజంగా దేవతవి.. ఇన్నాళ్ళు నువ్వు ఎలా ఉన్నావ్ అని కూడా ఒక ఫోన్ చేయలేదు అలాంటిది నాకు ఇంత సాయం చేశావు అంతా నీ తండ్రి అలాగే మీరు కూడా మంచి మనసు అంటాడు బాబాయ్. ఇంతకీ ఏసీపీ సర్ ఎలా ఉన్నారు అని అడుగుతాడు.

79

నా తండ్రిని చంపాడన్న ఒక్క బాధ తప్పితే ఆయనలో వెతకినా ఒక్క మచ్చ కూడా ఉండదు. నన్ను కూడా చాలా బాగా చూసుకుంటున్నారు అంటుంది కృష్ణ. ఆశ్చర్యపోయిన ఆ వ్యక్తి మీ నాన్నగారిని ఆయన చంపటం ఏంటి నువ్వు ఎక్కడో పొరపడ్డావు అంటూ జరిగిందంతా చెప్తాడు బాబాయ్. అసలు శివన్నని చంపే  ఆపరేషన్ లో మీ నాన్నగారిని పాల్గొవొద్దని ఏసీపీ సార్ చెప్పారు.

89

కానీ ఈ ఒక్క ఆపరేషన్ లో పాల్గొని తర్వాత రిటైర్ అయిపోతానని.. కావాలనే మీ నాన్నగారు ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్తాడు బాబాయ్. ఒక్కసారిగా నిష్చేస్టురాలు అయిపోతుంది కృష్ణ. పశ్చాతాపంతో కన్నీరు పెట్టుకుంటుంది మురారిని తను అన్న మాటలు అన్ని గుర్తు చేసుకుని బాధతో కుమిలిపోతుంది.

99

నిజం చెప్పి మంచి పని చేశావు బాబాయ్ అని చెప్పి అక్కడి నుంచి నేరుగా గుడికి వెళ్లి మోకాలితో గుడి మెట్లు ఎక్కుతూ ఉంటుంది. అది గమనించిన పంతులుగారు విషయాన్ని మురారి కి ఫోన్ చేసి చెప్తారు. మురారి కంగారుగా గుడికి బయలుదేరి వస్తాడు. తరువాయి భాగంలో కృష్ణ దగ్గరికి వచ్చిన మురారి పాదాలకి దండం పెట్టి కళ్ళకద్దుకుంటుంది కృష్ణ. అయోమయంగా చూస్తూ ఉండిపోతాడు మురారి.

click me!

Recommended Stories