Brahmamudi: రాహుల్ కి చెమటలు పట్టించిన కళ్యాణ్.. రాజ్ ని అపార్థం చేసుకున్న కావ్య!

Published : May 04, 2023, 01:24 PM IST

Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ టాప్ సీరియల్స్ కి గట్టి పోటీని ఇస్తూ మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. తప్పటడుగు వేసిన కూతుర్ని ఇంట్లో ఉంచుకోలేక బయటకి పంపించలేక అవస్థ పడుతున్న తల్లిదండ్రుల కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఏప్రిల్ 4 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

PREV
19
Brahmamudi: రాహుల్ కి చెమటలు పట్టించిన కళ్యాణ్.. రాజ్ ని అపార్థం చేసుకున్న కావ్య!

ఎపిసోడ్ ప్రారంభంలో ఇద్దరూ వెళ్లి ఒక్కదానివే తిరిగివచ్చావేమీ అంటుంది కనకం. రాహుల్ పెళ్లి కప్పుకున్నాడని ఆనందంలో నాతో అప్పు వచ్చిందనే సంగతి మర్చిపోయాను అనుకుంటుంది స్వప్న. బయటికి మాత్రం అప్పు పిజ్జా డెలివరీ కి ఆర్డర్ వస్తే వెళ్ళింది అంటుంది. అంతలోనే బురద అంటుకొని ఇంటికి వచ్చిన అప్పు ని చూసి ఏం జరిగింది అని అడుగుతుంది కనకం.

29

బురదలో జారి పడిపోయాను అని తల్లికి సమాధానం చెప్పి ఇంతకీ నీ ఫ్రెండ్ ఏమంటున్నాడు అని నోరు జారుతుంది అప్పు. మళ్లీ అదే ఏమంటుంది నీ ఫ్రెండ్ అంటూ సరిదిద్దుకుంటుంది. అప్పు గాని నన్ను ఫాలో అయిందా అంటూ అనుమాన పడుతుంది  స్వప్న. మరోవైపు ఒక ఫోటో ఇచ్చి ఈ అబ్బాయి తో నీకు పెళ్లి వచ్చేవారం పెళ్లిచూపులు పిచ్చిపిచ్చి వేషాలు వేయకుండా సిద్ధంగా ఉండు అంటుంది కనకం.

39

ఒక్క రోజులో నేను ఏమైనా చేయగలను అలాంటిది వారం రోజులు టైం ఇచ్చారు. ఈలోగా నాకు రాహుల్ తో అంగరంగ వైభవంగా పెళ్లి అయిపోతుంది నేను బంగ్లాలోకి వెళ్ళిపోతాను అనుకుంటుంది స్వప్న. ఈ వారం రోజుల్లో నీ ఎఫైర్ బయటపెట్టి కావ్యక్క జీవితాన్ని బాగు చేస్తాను అనుకుంటుంది అప్పు. మరోవైపు నిద్రతో అవస్థ పడుతున్న రాజ్ ని చూసి నీ గదికి వెళ్లి పడుకోవచ్చు కదా అంటుంది చిట్టి.

49

నాతో పాటు ఆ అమ్మాయి కూడా వస్తుంది అందుకే ఆలోచిస్తున్నాను అంటాడు రాజ్. భార్య ఉన్న తర్వాత తీసుకెళ్లావా ఏంటి అంటూ మందలిస్తుంది చిట్టి. అందుకు అపర్ణ అడ్డుపడితే వాళ్ళిద్దర్నీ ఇవ్వటానికి ప్రయత్నిస్తే నేను నిన్ను భార్యగా యాక్సెప్ట్ చేయను అంటూ బెదిరిస్తాడు సుభాష్. ఈ వయసులో మీ పేరెంట్స్ ని విడదీయడం అవసరమా? నీ భార్యని తీసుకొని నీ గదికి వెళ్ళు అంటుంది రుద్రాణి.

59

తప్పని సరి పరిస్థితుల్లో భార్యని తీసుకొని తన గదికి వెళ్తాడు రాజ్. నీ కొడుకు పూర్తిగా నీ చేతిలో నుంచి చేజారిపోయాడు అని అపర్ణని తలుచుకొని మనసులోనే ఆనందపడుతుంది రుద్రాణి. అప్పుడే ఇంటికి వచ్చిన రాహుల్ ని పెళ్లెప్పుడు అని అడుగుతాడు కళ్యాణ్. అదేంటి అలా అడిగావు అని షాక్ అవుతాడు రాహుల్. నీ మొహం లో పెళ్ళికళ కనిపిస్తుంది అంటాడు కళ్యాణ్.

69

ఆ మాటల్ని లైట్ తీసుకుంటాడు రాహుల్. స్వప్న తిరిగి వచ్చింది అంటాడు కళ్యాణ్. ఒక్కసారిగా షాక్ అయినా రాహుల్ ఏ స్వప్న అంటూ ఏమీ తెలియనట్లుగా అడుగుతాడు. ఏమీ తెలియనట్లు అలా మాట్లాడతావ్ ఏంటి తన దగ్గర ఫోన్ నెంబర్ తీసుకొని తనని నువ్వే కదా తన ఇంటి దగ్గర డ్రాప్ చేశావు అంటాడు కళ్యాణ్. ఓ తనా.. కావ్య వాళ్ళ అక్కే కదా అంటూ ఓవరాక్షన్ చేస్తాడు రాహుల్.

79

అవును తనే.. తన వెనకన ఉన్న వ్యక్తి కోసం వదిన వెతుకుతుంది. ఆమెకి హెల్ప్ చేస్తానని నేను మాట ఇచ్చాను అవసరమైతే నీ హెల్ప్ కూడా తీసుకుంటాను అంటాడు కళ్యాణ్. ఏం చెప్పాలో తెలియక అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రాహుల్. మరోవైపు తనతోపాటు గదిలోకి తీసుకువచ్చిన కావ్య బెడ్ మీద కూర్చోబోతుంటే ఆపుతాడు రాజ్. ఏంటి నా పక్కన పడుకోవటానికి ట్రై చేస్తున్నావా అది కుదరదు అంటాడు.
 

89

నాకు కూడా మీ పక్కన పడుకోవాలని ఆశ ఏమీ లేదు నేను కిందన పడుకుంటాను అంటుంది కావ్య. అప్పుడు నీతో పాటు నేను కూడా కిందన పడుకోవాలి అని దిగులుగా మొహం పెడతాడు రాజ్. అలా ఏమీ అక్కర్లేదు అంటూ బెడ్ పక్కనే కింద పక్క వేసుకొని పడుకుంటుంది కావ్య. మరోవైపు రాజ్ దంపతులు కలవడం కోసం లేని ఆచారాన్ని పంతులు గారితో చెప్పి చేయించాము. దోషమేమి తగలదు కదా అని భర్తని అమాయకంగా అడుగుతుంది చిట్టి. సాంప్రదాయాలు కట్టుబాట్లు అన్నీ మనుషుల్ని సుఖంగా సంతోషంగా ఉంచడానికే. దాని గురించి నువ్వు ఏమీ ఆలోచించకు అంటాడు సీతారామయ్య.

99

 మరోవైపు రాజ్ పెడుతున్న గురకకి బాగా ఇబ్బంది పడుతుంది కావ్య. గురకని ఆపడం కోసం ప్రయత్నాలు చేస్తుంది. తరువాయి భాగంలో నిద్దట్లో పక్కకి తిరిగేసరికి బ్రహ్మముడి ఉండడం వల్ల రాజ్ కూడా మంచం మీద నుంచి కావ్య మీద పడిపోతాడు. ఒక్కసారిగా కేక పెట్టిన కావ్య నన్నేమీ చేయొద్దు అంటూ గట్టిగా అరుస్తుంది. అంతలోనే చిట్టి వాళ్ళు గదిలోకి వచ్చి ఏం జరిగింది అని అడుగుతారు. చిట్టిని పట్టుకొని ఏడుస్తుంది కావ్య. రాజ్ అంటూ కొంటెగా చూస్తుంది చిట్టి. నానమ్మ నువ్వు అనుకున్నట్లు ఏం జరగలేదు అంటూ ఇబ్బందిగా మొహంపెడతాడు రాజ్.

click me!

Recommended Stories