కృష్ణ భగవాన్‌ ఇంట్లో జబర్దస్త్ కమెడియన్‌ లవర్‌.. తిరిగి పంపించమంటే మరో రెండు రోజులంటూ షాక్‌.. ఇంత మోసమా?

Published : Apr 12, 2024, 07:58 PM IST

జబర్దస్త్ కమెడియన్‌ ఇమ్మాన్యుయెల్‌, వర్ష, జడ్జ్ కృష్ణ భగవాన్‌ ల మధ్య సంఘటన `విక్రమార్కుడు` సినిమా సీన్‌ని తలపిస్తుంది. నమ్మినందుకు కమెడియన్‌ని మోసం చేశాడు జడ్జ్.   

PREV
17
కృష్ణ భగవాన్‌ ఇంట్లో జబర్దస్త్ కమెడియన్‌ లవర్‌.. తిరిగి పంపించమంటే మరో రెండు రోజులంటూ షాక్‌.. ఇంత మోసమా?

కృష్ణభగవాన్‌ కమెడియన్ గా అనేక సినిమాల్లో నటించి మెప్పించారు. ఆయనకు ఇప్పుడు సినిమాలు తగ్గాయి. ప్రస్తుతం జబర్దస్త్ కామెడీ షోకి జడ్జ్ గా ఉన్నారు. ఇంద్రజతో కలిసి ఆయన జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. కమెడియన్లపై తనదైన స్టయిల్లో పంచ్‌లు వేస్తూ నవ్వులు పూయించారు. 

27

తాజాగా కృష్ణ భగవాన్‌, జబర్దస్త్ కమెడియన్‌ మధ్య జరిగిన సంఘటన షాకిస్తుంది. ఇది రవితేజ, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన `విక్రమార్కుడు` సినిమా సీన్‌ని రిపీట్‌ చేయడం గమనార్హం. అందులో విలన్‌.. పోలీస్‌ అధికారి రాజీవ్‌ కనకాల భార్యని ఎత్తుకెళ్లిపోతారు. కనిపించలేదని ఆ విలన్‌కే కంప్లెయింట్‌ ఇస్తాడు. దీనికి రెండో రోజుల్లో వెతికి పంపిస్తానని విలన్‌ చెప్పడంతో ఆ సీన్‌ బాగా పండింది. హైలైట్‌ అయ్యింది. 

37

ఇప్పుడు అదే సీన్‌ ఇమ్మాన్యుయెల్‌, వర్షల విషయంలో చోటు చేసుకుంది. ఇమ్మాన్యుయెల్‌, జబర్దస్త్ వర్ష కలిసి స్కిట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరి మధ్య లవ్‌ ట్రాక్‌ బాగా ఫేమస్‌. చాలా సార్లు డ్యూయెట్లతో అదరగొట్టారు. పెళ్ళి వరకు వెళ్లారు. షోలో తమదైన కెమిస్ట్రీతో రక్తికట్టించారు. 
 

47

ఇక ఇప్పుడు ఇమ్మాన్యుయెల్‌.. తన లవర్‌ వర్షని ఎవరికి తెలియకుండా దాచే ప్రయత్నం చేశాడు. పెద్దవాళ్లకి తెలిస్తే సమస్య అవుతుందని, తన ప్రియురాలు వర్షని కృష్ణ భగవాన్‌ ఇంట్లో ఇచ్చాడు. సర్‌ రెండు రోజులు నా లవర్‌ ని మీ ఇంట్లో ఉంచండి అని చెప్పి వెళ్లిపోయాడు ఇమ్మాన్యుయెల్‌. 

57

రెండు రోజుల తర్వాత వచ్చిన ఇమ్మాన్యుయెల్‌.. సర్‌ మా లవర్‌ని పంపించండి అని అడగ్గా.. మరో రెండు రోజుల తర్వాత పంపిస్తా అని చెప్పడం షాకిచ్చింది. దీంతో ఇమ్మాన్యుయెల్‌కి ఫ్యూజులు ఎగిరిపోయాయి. `విక్రమార్కుడు` సినిమా సీన్‌ రిపీట్‌ అయ్యిందా అంటూ ఖంగుతిన్నాడు ఇమ్మూ. 

67

ఈ సీన్‌కి ఇంద్రజ, యాంకర్‌ రష్మితోపాటు ఇతర కమెడియన్లు అంతా ఘోల్లున నవ్వారు. స్కిట్‌ బాగా పేలింది. బాబుతో కలిసి ఇమ్మాన్యుయెల్‌, వర్ష చేసిన స్కిట్ లో భాగంగా ఈ ఎపిసోడ్‌ని ప్రదర్శించారు. ఇది ఆద్యంతం ఆకట్టుకుంది. 

77

 `ఎక్స్ ట్రా జబర్దస్త్` ప్రోమోలో ఇది హైలైట్గా నిలిచింది. ఈ ఎపిసోడ్‌ నేడు ఈటీవీలో టెలికాస్ట్ అవుతుండటం విశేషం. హిలేరియస్ గా నవ్వించేలా ఉందని చెప్పొచ్చు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories