`పుష్ప2`లో ఆరు నిమిషాల సీన్‌ కోసం 60కోట్లు.. వామ్మో ఆ ఎపిసోడ్‌కి పూనకాలే.. ఇంట్రెస్టింగ్‌ విషయాలు లీక్‌

Published : Apr 12, 2024, 06:34 PM ISTUpdated : Apr 12, 2024, 07:00 PM IST

`పుష్ప2` టీజర్‌ ఇటీవల విడుదలైంది. ఇందులో జాతర ఎపిసోడ్‌ని మెయిన్‌గా చూపించారు. ఈ ఎపిసోడ్‌కి అయిన బడ్జెట్‌, డేట్స్ గురించి తెలిస్తే మతిపోవాల్సిందే.   

PREV
16
`పుష్ప2`లో ఆరు నిమిషాల సీన్‌ కోసం 60కోట్లు.. వామ్మో ఆ ఎపిసోడ్‌కి పూనకాలే.. ఇంట్రెస్టింగ్‌ విషయాలు లీక్‌

అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న మూవీ `పుష్ప2`. సుకుమార్‌ రూపొందిస్తున్న ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు, ఇండియన్‌ ఆడియెన్స్ సైతం వెయిట్‌ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌ ఆద్యంతం ఆకట్టుకుంది. సినిమాపై ఇంట్రెస్ట్ ని పెంచింది. 
 

26

`పుష్ప2` టీజర్‌ లో జాతర ఎపిసోడ్‌ హైలైట్‌గా నిలిచింది. ఇందులో బన్నీ అమ్మోరు గెటప్‌లో కనిపించారు. స్టయిల్‌గా ఆయన చేసే ఫైట్స్ ఫిదా చేశాయి. అదే సమయంలో అల్లు అర్జున్‌లోని మరో యాంగిల్‌ని ఆవిష్కరించింది. ఇంటర్వెల్‌ ముందు ఈ ఎపిసోడ్‌ వస్తుంది. అంతేకాదు సినిమాలో ఇది హైలైట్‌గా నిలుస్తుందని అంటున్నారు. 
 

36

ఇదిలా ఉంటే ఈ ఎపిసోడ్‌ గురించి ఆసక్తికర అంశం సోషల్‌ మీడియాలో వినిపిస్తుంది. ఈ ఎపిసోడ్‌కి పెట్టిన ఖర్చు షాకిస్తుంది. సుకుమార్‌ ఏకంగా 60కోట్లు ఖర్చు చేశారట. కేవలం ఆరు నిమిషాలు మాత్రమే ఈ ఎపిసోడ్‌ ఉంటుందని, దానికి ఆరు కోట్లు అయ్యిందని తెలుస్తుంది. 
 

46

అంతటితో అయిపోలేదు, దీనికి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్‌ విషయం నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ ఆరు నిమిషాల ఎపిసోడ్‌ కోసం సుకుమార్ నెలరోజులు షూట్‌ చేశారట. పర్ ఫెక్షన్‌ కోసం, ఆయా భారీ సీన్‌ కోసం అంత టైమ్‌ పట్టిందట. సినిమా మొత్తంలోనే ఆ ఎపిసోడ్‌ హైలైట్గా ఉంటుందనే ఉద్దేశ్యంతో, సినిమాని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్తుందనే ఉద్దేశ్యంతో దర్శకుడు అంతటి రిస్క్ తీసుకున్నారని తెలుస్తుంది.
 

56

ఇలాంటి ఇంట్రెస్టింగ్‌ విషయాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. పైగా ఇందులో బన్నీ లేడీ గెటప్‌లో మతిపోయేలా ఉన్నాడు. పైగా ఆయన చేసే ఫైట్లు వాహ్‌ అనాల్సిందే అన్నట్టుగా ఉంది. జస్ట్ టీజర్‌లోనే ఇలా ఉంటే, ఇక సినిమాలు, జాతర ఎపిసోడ్‌లో, అంత మంది క్రౌడ్‌లో బన్నీ లేడీ గెటప్‌లో చూపించే విశ్వరూపం విజువల్‌ ట్రీట్‌లా ఉంటుందని చెప్పొచ్చు. 
 

66

ఇక బన్నీకి జోడీగా రష్మిక మందన్నా నటిస్తున్న `పుష్ప2`లో మలయాళ స్టార్‌ ఫహద్‌ ఫాజిల్‌ నెగటివ్‌ రోల్‌ చేస్తున్నారు. అనసూయ, సునీల్‌, వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా విడుదల కానుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories