Krishna Mukunda Murari: మాటల యుద్ధంతో రగిలిపోతున్న అత్తా కోడళ్ళు.. రేవతి ప్రవర్తనకు కృష్ణ దంపతులు షాక్?

Published : Jun 21, 2023, 02:05 PM IST

Krishna Mukunda Murari: స్టార్ మా లో ప్రసారమవుతున్న కృష్ణ ముకుంద మురారి సీరియల్ కథ కథనాలతో ప్రేక్షకుల అభిమానంతో మంచి టిఆర్పి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. కొడుకు కాపురాన్ని అతని  మాజీ ప్రేయసి నుంచి కాపాడుకోవడం కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్న ఒక తల్లి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు 21 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

PREV
19
Krishna Mukunda Murari: మాటల యుద్ధంతో రగిలిపోతున్న అత్తా కోడళ్ళు.. రేవతి ప్రవర్తనకు కృష్ణ దంపతులు షాక్?

 ఎపిసోడ్ ప్రారంభంలో మురారి ఏం మాట్లాడుతున్నావ్ అర్థం చేసుకుంటుంది కృష్ణ. ఇప్పుడు ఎందుకు ఇలా సతాయిస్తున్నావు అంటూ చిరాకుపడతాడు మురారి.అదిగో నా మీద చిరాకు పడుతున్నారు అంటూ ఏడుపు అందుకుంటుంది కృష్ణ. ఇప్పుడు ఏం జరిగిందని ఏడుస్తున్నావు అని కంగారు పడిపోతాడు మురారి. ఏడుస్తూ ఏడుస్తూనే నవ్వులోకి టర్న్ అవుతుంది కృష్ణ.

29

ఎలా ఉంది మొగుడు పెళ్ళాల ఆట అంటూ భర్తని ఆట పట్టిస్తుంది. ఇదంతా ఆట ప్రభావమా.. ఆటలో పరకాయ ప్రవేశం చేసావు మొత్తానికి చెమటలు పట్టించేసావు అని మురారి కూడా నవ్వుతాడు. సీన్ కట్ చేస్తే రేవతి, ముకుంద ఎదురుపడతారు. నా గురించి ఆలోచించి అర్థం చేసుకుంటావనుకొని నిజం చెప్పాను. కానీ నువ్వు ఇలా రియాక్ట్ అవుతావు అనుకోలేదు ఈసారి డైరెక్ట్ ఎటాకే అని రేవతి ని తిట్టుకుంటుంది ముకుంద.

39

 ఎక్కడికి వెళ్లావు అని ముకుందని అడుగుతుంది రేవతి. ఎక్కడికి వెళ్లానని మీరు అనుకుంటున్నారో అక్కడికే వెళ్లాను అని పొగరుగా సమాధానం చెప్తుంది ముకుంద. ఎందుకు వెళ్లావు వాళ్ళిద్దర్నీ సంతోషంగా ఉండనివ్వవా అని కోపంగా అడుగుతుంది రేవతి. ఇన్నాళ్లు నేను కుటుంబం కోసం, పరువు కోసం ఆలోచించి  నోరు మూసుకున్నాను కానీ ఇకమీదట నాకు దక్కాల్సింది. దక్కించుకుంటాను అంటుంది ముకుంద. కానీ పెళ్లి పవిత్రమైన బంధం అంటుంది రేవతి.
 

49

 అంతకన్నా పవిత్రమైనది ప్రేమ మీరు బలవంతంగా హోమాలు అయితే చేయించగలరు కానీ బలవంతంగా కాపురాలు చేయించలేరు కదా ఎప్పటికైనా మురారి నా వాడే చూస్తూ ఉండండి అంటూ పొగరుగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ముకుంద. ముకుంద ప్రవర్తనకి షాక్ అవుతుంది రేవతి. సీను కట్ చేస్తే హాల్లో సోఫాలో కూర్చున్న రేవతి తన ప్రేమ విఫలమైనందుకు ముకుందా పిచ్చిదాని పోతుంది అనుకున్నాను కానీ తన క్లారిటీ లో తను ఉంది.
 

59

 తను చెప్పాల్సింది తను చెప్పింది ఇక నేను చేయవలసింది చెయ్యాలి అనుకుంటుంది. ఇంతలోనే కృష్ణ దంపతులు ఇంటికి వస్తారు. వాళ్లకి దిష్టి తీస్తుంది రేవతి. ఏ పాడు మనసు దృష్టి ఏ పాపిష్టి ప్రేమ దిష్టి నా కొడుకు కోడలు జీవితాన్ని పాడు చేయకూడదు అంటూ దేవుడిని ప్రార్థిస్తుంది. ప్రేమ మనసు అంటుంది రేవతి అత్తయ్య అంటే ముకుంద మురారిలా ప్రేమ విషయం తెలిసిపోయి ఉంటుందంటావా అనే భర్తతో అంటుంది అలేఖ్య.

69

 తెలిసిపోవడం ఏమిటి పెద్దమ్మకి  చెప్పిందే నేను కదా అంటాడు మధుకర్. రేవతి ముకుందని పిలిచి భార్యాభర్తలిద్దరికీ హారతి ఇవ్వు అని చెప్తుంది. ఇదంతా నాతో కావాలని చేస్తున్నారు కదా అత్తయ్య ఇంకెన్నాళ్లు కొద్దిరోజులే కదా ఆ తర్వాత మీ ప్రేమ మీ ఆశీర్వచనాలు అన్నీ నాకే ఎప్పటికైనా నేనే మీ కోడల్ని అని మనసులో అనుకొని కృష్ణ దంపతులకి హారతి ఇస్తుంది ముకుంద. ఆ తరువాత ఎవరి మటుకు వాళ్లు వెళ్లిపోతారు.
 

79

 అప్పుడు ముకుందతో ఇందాక ఏమన్నావు బలవంతంగా కాపురం చేయించలేనని కదా అన్నావు కానీ కొద్ది రోజులు కలిసి ఉంటే వాళ్ళు వీళ్ళు అవుతారు  చూస్తూ ఉండు వాళ్ల బంధం ఎప్పటికీ శాశ్వతంగానే ఉంటుంది అంటుంది రేవతి. పెద్ద అత్తయ్య ఇంట్లో లేరు కాబట్టి నీ ఆటలు మీ కోడలి ఆటలు సాగుతున్నాయి. ఆవిడకి గాని కృష్ణ చేస్తున్నది అసలు కాపరమే కాదు అని తెలిస్తే ఆవిడే కృష్ణని మెడ పట్టుకుని బయటికి గెంటేస్తారు.

89

ఒక తప్పు చేస్తేనే క్షమించరు అలాంటిది మీ కోడలు రెండు తప్పులు చేసింది అంటే పనిష్మెంట్ ఎలా ఉంటుందో ఊహించుకోండి. పెద్ద అత్తయ్య ఆశ్రమం నుంచి ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా నిజం తెలుసుకోవచ్చు అని బెదిరిస్తున్నట్లుగా మాట్లాడి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ముకుంద. ఆ మాటలకి టెన్షన్ పడుతుంది రేవతి. తరువాయి భాగంలో కమిషనర్ గారు మురారి కి వారం రోజులు సెలవు శాంక్షన్ చేస్తారు.

99

ఎందుకు అని ఆశ్చర్యపోయే లాగానే రేవతి మీరు వచ్చే వారం రోజులు ఫామ్ హౌస్ లో ఉండాలి అని చెప్తుంది రేవతి ప్రవర్తనకి ఆశ్చర్యపోతారు కృష్ణ దంపతులు. ఇదంతా చూస్తున్న ముకుంద మురారిని నా నుంచి దూరం చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నవు కదా అత్తయ్య అని మనసులో అనుకుంటుంది. ముకుంద.

click me!

Recommended Stories