దీనికి తోడు ఆదిపురుష్ చిత్రంపై విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. రామాయణ పురాణ గాధతో తెరకెక్కించిన చిత్రం కావడంతో ఇందులోని పాత్రలు, దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన విధానం, డైలాగ్స్ పై ఆడియన్స్ లో ఫోకస్ ఎక్కువగా ఉంది. అలాగే గ్రాఫిక్స్ పై కూడా విమర్శలు చెలరేగుతున్నాయి. నెటిజన్లు దర్శకుడు ఓం రౌత్, రచయిత మనోజ్ ముంతాషీర్, నిర్మాతలని హిందూ వాదులు టార్గెట్ చేస్తున్నారు. పలు చోట్ల ఆదిపురుష్ చిత్రంపై ఫిర్యాదులు నమోదవుతున్నాయి.