Shweta Basu Prasad: కొత్త బంగారు లోకం హీరోయిన్ షాకింగ్ లుక్... శ్వేతా బసు ఇలా ఐపోయిందేంటీ!

Published : Jan 14, 2023, 10:09 AM ISTUpdated : Jan 14, 2023, 10:16 AM IST

కొత్త బంగారు లోకం ఫేమ్ శ్వేతా బసు ప్రసాద్ లేటెస్ట్ లుక్ చూసిన తెలుగు ఆడియన్స్ షాక్ తింటున్నారు. అసలు ఆమె ఈమేనా అనే సందేహం వెల్లిబుతున్నారు. అంతగా ఆమె ప్రస్తుత అవతారం ఉంది.   

PREV
17
Shweta Basu Prasad: కొత్త బంగారు లోకం హీరోయిన్ షాకింగ్ లుక్... శ్వేతా బసు ఇలా ఐపోయిందేంటీ!
Shweta Basu Prasad

కొత్త బంగారు లోకం అనగానే టక్కున బాలు, స్వప్న గుర్తొస్తారు. ఈ రెండు టీనేజ్ క్యారెక్టర్స్ అంతగా ప్రేక్షకుల మనసు దోచుకున్నాయి. టీనేజ్లోకి అడుగుపెట్టగానే అమ్మాయిలు, అబ్బాయిల్లో కలిగే ప్రేమ ఆలోచనలు... వాటి వలన వారి మాటల్లో, చేతల్లో, ఆలోచనల్లో కలిగే మార్పులు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలా చాలా సహజంగా చూపించాడు.

27
Shweta Basu Prasad

టీనేజ్ లో ప్రేమలో పడటం తప్పని చెబుతూనే శ్రీకాంత్ అడ్డాల అందమైన ముగింపు ఇచ్చారు. ప్రేమ కథకు కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ జోడించి ఆయన ఓ అందమైన లవ్ స్టోరీ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు. ఆ సినిమాలో స్వప్న పాత్ర చేసిన శ్వేతా బసు ప్రసాద్ రోజుల తరబడి ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. ఒక అందమైన జ్ఞాపకంగా వెంటాడింది.

37
Shweta Basu Prasad

శ్వేతా బసు ప్రసాద్ కొత్త బంగారు లోకం మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. అయితే ఆమెకు లక్ కలిసిరాలేదు. స్క్రిప్ట్ సెలక్షన్ లో తడబడిన శ్వేతా బసు వరుస పరాజయాలు ఎదుర్కొన్నారు. 
 

47
Shweta Basu Prasad


ఆమె రేసులో వెనుకబడడానికి మరొక కారణం... బాగా లావయ్యారు. కొత్త బంగారు లోకం మూవీలో ఎత్తుకు దగ్గ బరువుతో క్యూట్ అండ్ స్లిమ్ గా ఉన్న శ్వేతా రానురానూ బరువు పెరిగారు. పొట్టిగా ఉండే శ్వేత లావు కావడంతో షేప్ అవుటై దర్శక నిర్మాతల నుండి తిరస్కరణ ఎదుర్కొన్నారు. 
 

57
Shweta Basu Prasad

తెలుగు ప్రేక్షకులు శ్వేతా బసు ప్రసాద్ ని చూసి చాలా రోజులు అవుతుంది. అయితే ఆమె లేటెస్ట్ లుక్ చూసి షాక్ అవుతున్నారు. సన్నబడిన శ్వేతా బసు ప్రసాద్... అల్ట్రా స్టైలిష్ గా తయారయ్యారు. కొత్త బంగారు లోకం మూవీలో ఆమెను చూసిన ఆడియన్స్ లేటెస్ట్ లుక్ చూసి... ఆమె ఈమేనా? అంటున్నారు. అంతగా శ్వేత మారిపోయారు. 
 

67
Shweta Basu Prasad


కాగా కెరీర్లో ఫెయిల్ అయిన శ్వేతా బసును సెక్స్ రాకెట్‌ వెంటాడింది. దీని వల్ల అనేక ఇబ్బందులు పడింది. తనని కావాలని ఇరికించారని ఆరోపించింది. అయినా ఈ అమ్మడికి సినిమా అవకాశాలు రాలేదు. 
 

77
Shweta Basu Prasad

ఆ తర్వాత బాలీవుడ్‌ దర్శకుడు రోహిత్‌ మిట్టల్‌ని ప్రేమించి 2018 డిసెంబర్ 13న పెళ్లి చేసుకుంది. మ్యారేజ్‌ విషయంలో కూడా శ్వేతకి ఇబ్బందులు తప్పలేదు. ఫ్యామిలీ లైఫ్‌ సెట్‌ కాలేదు. పెళ్లి చేసుకున్న   ఏడాదిలోపే విడాకులు తీసుకున్నారు. ఆ సమయంలో ఓ నోట్‌ని కూడా ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది శ్వేత.
 

click me!

Recommended Stories