Guppedantha Manasu: కాలేజీ స్టాఫ్ పై సీరియస్ అయిన జగతి.. వసుధారని క్షమించమని అడిగిన చక్రపాణి?

First Published Jan 14, 2023, 9:38 AM IST

Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు జనవరి 14వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
 

గత ఎపిసోడ్లో చక్రపాణి పోలీసుల ముందు అసలు దూషి రాజు అని చెప్పడంతో తన బండారం బయటపడేలా ఉంది అని రాజీవ్ తప్పించుకుని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత చక్రపాణి వసుధార కి క్షమాపణలు చెప్పి నిన్ను నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను నన్ను క్షమించు తల్లి నువ్వు ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకో అని అంటాడు. దాంతో సంతోష పడుతూ ఉంటుంది వసుధార. మరొకవైపు వసుధార జ్ఞాపకాలతో రిషి సతమతమవుతూ ఉంటాడు. కాలేజీలో పదేపదే వసుధారను తలుచుకోవడంతో అది చూసి కాలేజీ స్టాప్ నవ్వుకుంటూ ఉంటారు. వసుధార, రిషి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది.
 

ఈరోజు ఎపిసోడ్లో వసుధార ఫోన్లో రిషి ఫోటో చూస్తూ బాధపడుతూ ఉంటుంది. రిషి సార్ వచ్చారు వెళ్లారు ప్రతిక్షణం మీ జ్ఞాపకాలే అనుకుంటూ ఉండగా మరొకవైపు రిషి కూడా వసుధార జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. నన్ను ఇంతలా మాయ చేసి నువ్వు వేరే వాళ్ళను ఎలా పెళ్లి చేసుకున్నావు వసుధార అని బాధపడుతూ ఉంటాడు రిషి. ఆరోజు నువ్వు నన్ను ఇందుకేనా కాపాడింది బతికించింది. క్షణం క్షణం చంపుతున్నావు కదా వసుధార అని అంటాడు. నాకేమైనా జరిగితే నీ ఊపిరి ఆగిపోతుంది అన్నావు ఇప్పుడు నువ్వే నా ఊపిరి తీస్తున్నావు అనుకుంటూ ఉంటాడు రిషి. జ్ఞాపకాలు అన్ని వానజల్లుగా మారుతాయి అనుకున్నాను ఇప్పుడే ఇవన్నీ వడగండ్లలా మారుతాయి అని తెలిసింది సర్ అని అనుకుంటూ ఉంటుంది.
 

అప్పుడు వసుధార చక్రపాణి ఫోన్ నుంచి రిషికి ఫోన్ చేస్తుంది. అప్పుడు రిషి ఫోన్ చేసి హలో ఎవరు మాట్లాడేది వసుధార అంటాడు. అప్పుడు రిషి వసుధార అనడంతో వసు కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పుడు ఫోన్ కట్ చేయడంతో వెంటనే రిషి మళ్ళీ ఫోన్ చేస్తాడు. అప్పుడు వసుధార ఏం చేయాలో తెలియక ఫోన్ కట్ చేస్తుంది. అప్పుడు రిషి పదేపదే ఫోన్ చేస్తూ ఉండగా పక్కనే ఉన్న నర్స్ కి ఫోన్ ఇచ్చి రాంగ్ నెంబర్ అని చెప్పమంటుంది వసుధార. ఆ తర్వాత వసుధార బిల్ పే చేయడానికి వెళ్ళగా అప్పుడు రిషేంద్రభూషణ్ అనే వ్యక్తి బిల్ కట్టాడు అనడంతో అవునమ్మా బిల్లు కట్టాడు అతని మంచితనం ఏంటో నాకు బాగా తెలిసి వచ్చింది అని చక్రపాణి జరిగింది మొత్తం వివరించడంతో వసుధార సంతోషపడుతూ ఉంటుంది.
 

 గంధపు చెక్క ఏదో విషపు మొక్క ఏదో లేటుగా తెలుసుకున్నాను. తొందరగా వెళ్లి రిషి సార్ ని కలుసుకో అమ్మ అని అంటాడు చక్రపాణి. మరొకవైపు కాలేజీలో స్టాఫ్ రిషి,వసు, జగతి ల గురించి తప్పుగా మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు ఈ భూషణ్ ఫ్యామిలీనే ఇంత ఏమని చెప్పగలం అని అనడంతో కోపంతో రగిలిపోతున్న జగతి మేడం అని గట్టిగా అరుస్తుంది. ఏం మాట్లాడుతున్నారు మేడం ఒక్కసారి ఒకసారి చెప్తే అర్థం కాదా ఒక మనిషి బాధలో ఉన్నప్పుడు పాజిటివ్ గా చూడాలి కానీ ఇలా టాపిక్ దొరికింది కదా అని మాట్లాడుకోకూడదు అని ఫైర్ అవుతుంది జగతి. మేమే మాట్లాడడం మేడం అని నాటకాలు ఆడడంతో మీరు మాట్లాడింది మొత్తం నేను విన్నాను అంటుంది జగతి.
 

మీకు జీతాలు ఇచ్చి మిమ్మల్ని పోషిస్తుంటే భూషణ్ ఫ్యామిలీనే దూషిస్తున్నారా అంటూ సీరియస్ అవుతుంది. మీరేం చిన్నపిల్లలు కాదు కదా మేడం లెక్చరర్స్ ప్రతిసారి వసుధారని టార్గెట్ చేస్తూ మీ మాటలతో తూట్లను ఆమె గుండెను పొడిచారు. ఆ అమ్మాయి కూడా మీ కూతురు లాంటిదే కదా ఎందుకు మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు అని తిడుతుండగా ఇంతలో రిషి అక్కడికి వచ్చి ఆ మాటలు వింటూ ఉంటాడు. మిమ్మల్ని తిరిగి వసుధార ఒక మాట అనలేదు రిషికి కూడా మీ గురించి ఒక్క మాట చెప్పలేదు అనడంతో వారిద్దరూ తలదించుకుంటారు. అవసరంగా సాటి స్త్రీనిందలు వేసి అవమానపరిస్తే మీకేం వస్తుంది మేడం ఇంకొకసారి రిపీట్ కాకూడదు అని వాళ్ళిద్దరికీ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది జగతి.
 

మరొకవైపు వసుధార చక్రపాణి సుమిత్ర ముగ్గురు ఇంటికి వెళ్తారు. అప్పుడు ఇల్లు మొత్తం చెల్లాచెదురుగా పడి ఉండడంతో అది చూసి బాధపడుతూ ఉంటారు. అప్పుడు చక్రపాణి రాజీవ్ అన్న మాటలు చేసిన పనులు గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు వసుధార చక్రపాణి దగ్గరికి వెళ్లి ఏం ఆలోచించొద్దు నాన్న అనడంతో ఆలోచించకుండా ఎలా ఉంటానమ్మా జరిగింది చిన్న విషయం కాదు కదా అని అంటాడు. అప్పుడు చక్రపాణి బాధపడుతుండగా వసుధార ఓదారుస్తుంది. ఆ తర్వాత చక్రపాణి అక్కడి నుంచి లేచి పక్కకు వెళ్లి వసుధార కాళ్ళ మీద పడతాడు. అయ్యో నాన్న ఏంటిది ముందు పైకి లేవండి ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటుంది వసుధార.

నన్ను క్షమించు వసుధార అని ఏడుస్తూ ఉంటాడు చక్రపాణి. అప్పుడు సుమిత్ర ఏంటండీ మీరు ఇలా చేస్తున్నారు అని అంటుంది. ఏం మాట్లాడాలో తెలియడం లేదు నా ప్రవర్తనకి నేను సిగ్గుపడుతున్నాను అని అంటాడు. అప్పుడు చేతులు జోడించి వసుధారని నన్ను క్షమించు అమ్మ అని ఏడుస్తూ ఉంటాడు. తర్వాత వసుధారని సుమిత్రను దగ్గరికి తీసుకుంటాడు. అప్పుడు వసు అక్కడే ఉన్న రిషి వాచ్ ను చూసి అది తీసుకుంటుంది. అప్పుడు ఆ వాచీ పక్కన పెట్టాలి అని చూస్తుండగా అది తన మంగళసూత్రానికి తగులుకుంటుంది. కానీ ఆ వాచ్ రాకపోయేసరికి బంధం ఎప్పటికీ విడిపోదేమో అని అనుకుంటూ ఉంటుంది వసుధార.
 

ఆ తర్వాత ఒక గదిలో కూర్చున్న వసుధార రాజీవ్ అన్న మాటలు రిషి గొప్పతనాన్ని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. నేను ఒక లూజర్ ని కానీ నువ్వు నాకు జెంటిల్మెన్ అని పేరు పెట్టావు అని రిషి అనగా వెంటనే వసుధార మీరు ఏంటో మీ మనసు ఏంటో నాకు తెలుసు అనగా వెంటనే రిషి నా మనసు ఏంటో నీకు తెలిస్తే ఎందుకు ఇలా చేశావు వసుధార అని అంటాడు. ఇప్పుడు వసుధార రిషి పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకుంటూ బాధను పంచుకుంటూ ఉంటారు. రిషి నుంచి రిషిధారగా ఎలా మారిందో నీకు తెలుసు అనగా ఈ రిషిధారలో దారను క్షమించండి ధర కన్నీటి ధారగా మారింది అని బాధపడుతూ ఉంటుంది వసుధార. నేను మిమ్మల్ని బాధ పెట్టాను అనగా నువ్వు నన్ను బాధ పెట్టావు అంటే ఇప్పటికి నేను నమ్మలేకపోతున్నాను వసుధార అని అంటాడు.

click me!