బాహుబలిని డామినేట్ చేసిన 70 ఏళ్ళ నాటి సినిమా.. జనాలు ఎప్పుడో మరచిపోయారు అంటూ రాజమౌళిపై కామెంట్స్

Published : Feb 12, 2026, 09:26 PM IST

బాహుబలి సినిమాపై లెజెండ్రీ నటుడు ఒకరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 70 ఏళ్ళ నాటి సినిమాతో పోల్చుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారో ఈ కథనంలో తెలుసుకుందాం. 

PREV
15
రాజమౌళి సినిమాలు

దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు వారణాసి చిత్రంతో పాన్ వరల్డ్ మార్కెట్ పై కన్నేశారు. ప్రస్తుతం ఈ సినిమాతో రాజమౌళి చేస్తున్న ప్రయత్నాలన్నీ హాలీవుడ్ స్థాయిలో ఉంటున్నాయి. రాజమౌళి పాన్ ఇండియా ప్రభంజనం బాహుబలి చిత్రంతో ప్రారంభమైంది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి బాహుబలి ఓ కుదుపు కుదిపింది. ఎక్కడ చూసినా జనాలు బాహుబలి గురించే మాట్లాడుకున్నారు.

25
బాహుబలి మూవీ

అయితే బాహుబలి మూవీపై లెజెండ్రీ నటుడు కోట శ్రీనివాసరావు గతంలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. బాహుబలి వ్యాపార పరంగా ఎంత బాగా రాణించినప్పటికీ జనాలు త్వరగా ఆ చిత్రాన్ని మరచిపోయారు అని కోట తెలిపారు.

35
రాజమౌళి బాగా తీశారు కానీ

బాహుబలి.. బాహుబలి అన్నారు.. ఆ సినిమా రిలీజ్ టైంలో బాత్రూం లోకి కూడా ప్రచార చిత్రాలు వినిపించేవి. అంత హంగామా చేశారు. రిలీజై పెద్ద విజయం సాధించింది. రాజమౌళి బాగా తీశారు. కానీ 6 నెలల్లోనే జనాలు పూర్తిగా ఆ చిత్రాన్ని మరచిపోయారు.

45
మాయాబజార్ మూవీ

అదే మాయాబజార్ చూడండి.. 60 ఏళ్ళు పైగా అవుతున్నా ఇంటిల్లిపాదీ ఆ చిత్రం గురించి మాట్లాడుకుంటారు. సినిమా అంటే జనాల్లో నిలిచిపోవాలి, వ్యాపారం మాత్రమే కాదు అని కోట శ్రీనివాస రావు తెలిపారు.

55
కోట శ్రీనివాసరావు విలక్షణ నటన

కోట శ్రీనివాసరావు కొన్ని దశాబ్దాల పాటు తన విలక్షణ నటనతో తెలుగు ప్రేక్షకులని అలరించారు. విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించారు. కోట శ్రీనివాసరావు గతేడాది వృద్ధాప్య కారణాల వల్ల మరణించిన సంగతి తెలిసిందే.

Read more Photos on
click me!

Recommended Stories