టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో నివసిస్తున్నారు. ఆయన విలాసవంతమైన బంగ్లాకు సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కోట్ల రూపాయల విలువైన ఆ ఇంట్లో ఏమేం ఉన్నాయో తెలుసా?
సౌత్ ఇండియాలో అత్యంత ఖరీదైన, సక్సెస్‌ఫుల్ హీరోల్లో మహేష్ బాబు ఒకరు. ఈయనకు దేశ విదేశాల్లో కోట్లమంది అభిమానులు ఉన్నారు. భారీ స్థాయిలో ఫాలోయింగ్ ఉంది. మహేష్ బాబు కు భారీగా ఆస్తులతో పాటు హైదరాబాద్ లో అదిరిపోయే ఇల్లు కూడా ఉంది.
28
మహేష్ బాబు విలాసవంతమైన బంగ్లా
మహేష్ బాబు ఇల్లు హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో ఉంది. ఇది ఎన్నో లగ్జరీ సౌకర్యాలతో నిండిన ఓ పెద్ద బంగ్లా. స్టార్ హీరో మహేష్ బాబు ప్రపంచ స్థాయి వస్తువులతో ఇంటిని నింపేశారు.
38
హైదరాబాద్ లో అద్భుతమైన లొకేషన్ లో..
మహేష్ బాబు ఈ ఇంట్లో తన భార్య, నటి నమ్రతా శిరోద్కర్, ఇద్దరు పిల్లలు సితార, గౌతమ్‌తో కలిసి ఉంటున్నారు. ఈ ఇల్లు చాలా సింపుల్ డెకరేషన్‌తో చూడటానికి ఎంతో క్లాస్‌గా కనిపిస్తుంది. ఈ ఇంటి నుంచి సిటీ వ్యూ కూడా అద్భుతంగా కనిపిస్తుంటుంది.
మహేష్ బాబు లగ్జరీ ఇంట్లో ఇండోర్ స్విమ్మింగ్ పూల్ నుంచి రీడింగ్ రూమ్ వరకు అన్నీ ఉన్నాయి. ఇంటి గోడలు ఆఫ్-వైట్ కలర్‌లో ఉంటాయి. చెక్కతో చేసిన మెట్లు ఇంటికి ప్రత్యేకమైన అందాన్ని తెచ్చిపెట్టాయి.
58
విశాలమైన లివింగ్ రూమ్
మహేష్ బాబు, నమ్రతల ఈ ప్యాలెస్ లాంటి ఇంట్లో పెద్ద లివింగ్ రూమ్ ఉంది. అందులో బ్రౌన్ కలర్ సోఫా సెట్ వేశారు. దాని వెనక గోడకు గ్రీన్ కలర్ పెయింట్ వేశారు. ఇంట్లో చాలా అందమైన పెయింటింగ్స్ కూడా కనువిందు చేస్తుంటాయి.
68
హోమ్ థియేటర్
అంతేకాదు, ఈ ఇంట్లో ఒక హోమ్ థియేటర్ కూడా ఉంది. దాని కింద బ్రౌన్ కలర్ క్యాబినెట్లు ఉన్నాయి. ఫ్యామిలీతో తాను చూడాలకుంటున్న సినిమాలు, సిరీస్ లను మహేష్ బాబు ఇక్కడే ఎంజాయ్ చేస్తుంటారు. ఇక డైనింగ్ ఏరియాలో గ్రే కలర్ సోఫా సెట్‌తో పాటు పెద్ద టేబుల్ ఉంది. ఇక్కడి గోడను ఎర్ర ఇటుకలతో అలంకరించారు.
78
అద్భుతమైన దేవుడి గది
వీటన్నింటితో పాటు, ఈ ఇంటి అందాన్ని మరింత పెంచేది ఇక్కడి పూజా మందిరం. మహేశ్, నమ్రత తరచుగా తమ పూజ గది ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటారు. ఈ జంట ఇంట్లో ఎక్కువగా పూజలు చేస్తుంటారు.
88
మహేష్ బాబు బంగ్లా ధర ఎంత?
రిపోర్టుల ప్రకారం, హైదరాబాద్‌లోని మహేష్ బాబు ఇంటి విలువ రూ.28 కోట్లు అని చెబుతున్నారు. ఈ ఇంట్లో పర్సనల్ జిమ్, లైబ్రరీ, స్విమ్మింగ్ పూల్ అన్నీ ఉన్నాయి. అంతేకాదు, మహేష్ బాబుకు చెన్నైలో కూడా ఒక ఇల్లు ఉన్నట్టు సమాచారం.