కృష్ణా జిల్లా కృష్ణాజిల్లా కంకిపాడులో 1942 జూలై 10 న జన్మించారు కోట శ్రీనివాసరావు. ఆయన తండ్రి సీతారామాంజనేయులు ఆయుర్వేద డాక్టర్. కోటను తండ్రి బాగా చదివించారు. డాక్టర్ కావాలి అనుకున్న కోటా శ్రీనివాసరావుకు డిగ్రీ అయిపోగానే బ్యాంక్ లో ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. అప్పటికే నాటకాల్లో అడుగుపెట్టిన ఆయనకు నటన తెలియడంతో ఉద్యోగానికి సెలవులు పెట్టి మరీ నాటకాలు వేసేవారు. ఇక సినిమా అవకాశాలు కూడా రావడంతో వెండితెరపై బిజీ అయ్యారు, అటు ఉద్యోగం, ఇటు సినిమాలు రెండింటిని చూసుకోలేక.. సినిమాల కోసం ప్రభుత్వ ఉద్యోగాన్నే వదిలేసుకున్నారు కోట శ్రీనివాసరావు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం సినిమాల్లో ఆయన నటించారు.