కోట శ్రీనివాసరావు సినిమాల్లో ఆయన భార్యకి ఇష్టమైన మూవీ ఏంటో తెలుసా? ఆ ఒక్కటి తప్ప ఏదీ నచ్చదట

Published : Aug 18, 2025, 08:28 PM IST

కోట శ్రీనివాసరావు విలక్షణ నటుడిగా రాణించారు. ఆయన నటించిన చిత్రాల్లో ఆయన భార్య రుక్మిణీకి బాగా నచ్చిన మూవీ ఏంటో తెలుసా? ఆ ఒక్కటి తప్ప ఏదీ నచ్చదట. 

PREV
15
అనారోగ్యంతో కన్నుమూసిన కోట శ్రీనివాసరావు భార్య

తెలుగు తెర విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు గత నెలలో తుదిశ్వాస విడిచారు. ఇప్పుడు ఆయన భార్య రుక్మిణీ కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సోమవారం ఉదయం కన్నుమూశారు. ఇదిలా ఉంటే కోట శ్రీనివాసరావు భార్య రుక్మిణి పాత ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇందులో ఆమె ఆసక్తికర విషయాలను పంచుకుంది. కోట శ్రీనివాసరావు నటించిన సినిమాలపై ఆమె స్పందించారు.

DID YOU KNOW ?
నెల క్రితమే కోట కన్నుమూత
కోట శ్రీనివాసరావు గత నెల 13న కన్నుమూసిన విషయం తెలిసిందే. అనారోగ్యంతో ఆయన మృతి చెందారు. నెల లోపే ఆయన భార్య మరణం విషాదకరం.
25
కోట భార్యకి నచ్చిన మూవీ `అహ నా పెళ్లంట`

కోట శ్రీనివాసరావు నటించిన చిత్రాల్లో తనకు బాగా నచ్చిన మూవీ `అహ నా పెళ్లంట` అని తెలిపింది. అందులో పిసినారిగా కోట బాగా చేశాడని, అద్భుతంగా పాత్రలో ఒదిగిపోయాడని తెలిపింది. ఆ సినిమా తనకు బాగా నచ్చుతుందని తెలిపింది. ఆ సినిమా తప్ప తనకు వేరే సినిమాలు పెద్దగా నచ్చవు అని పేర్కొంది. సుమన్‌ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం తెలిపింది.

35
కోటకి ఓర్పు ఎక్కువ

కోట గురించి చెబుతూ, `ఆయనకు ఓర్పు ఎక్కువ అని, అవతలి వ్యక్తులు ఎవరైనా ఏదైనా అన్నా, మళ్లీ బయటపడరు. పోనిలే అని ఊరుకుంటారు` అని తెలిపింది రుక్మిణీ. కోటకి ఫ్రెండ్స్ ఎక్కువ అని, ఎప్పుడూ బయటే ఉంటారని తెలిపింది. ఇదిలా ఉంటే 1973లో రుక్మిణీ డెలివరీ సమయంలో తన తల్లి మరణించిందని, దీంతో కాస్త మానసికంగా డిస్టర్బ్ అయినట్టు సమాచారం. దాదాపు ముప్పై ఏళ్ల పాటు ఆమె ఎవరినీ పెద్దగా గుర్తుపట్టలేకపోయిందట. ఈ విషయాన్ని కోట ఎప్పుడూ బయటకు చెప్పలేదు. కాకపోతే కొన్నాళ్లుగా ఆమె బాగానే ఉందని సమాచారం.

45
భార్య గురించి కోట శ్రీనివాసరావు కామెంట్‌

ఇక `ఫిల్మీబీట్‌`కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భార్య గురించి కోట మాట్లాడుతూ, తన భార్య తనకు అన్ని రకాలుగా సపోర్ట్ గా నిలిచిందని, తాను బయట వేసే ఎదవ వేషాలన్నింటిని మనసులో పెట్టుకోకుండా క్షమించి సపోర్ట్ చేసిందన్నారు. తన సినిమాల గురించి అడిగినప్పుడు బాగా చేశారని చెబుతుందని, తనకు అన్ని సినిమాలు నచ్చుతాయని, కాకపోతే వాటిలో `ఆహానా పెళ్లంట` సినిమా బాగా నచ్చుతుందని కోట తెలిపారు.

55
పిసినారి లక్ష్మీపతిగా కోట విశ్వరూపం

`అహ నా పెళ్లంట` మూవీలో రాజేంద్రప్రసాద్‌ హీరోగా నటించగా, కోట శ్రీనివాసరావు కీలక పాత్ర పోషించారు. బ్రహ్మానందం మరో ముఖ్య పాత్రలో నటించారు. ఇందులో పిసినారి లక్ష్మీపతిగా కోట శ్రీనివాసరావు నటించారు. పిసినారిలోనే అత్యంత పిసినారి పాత్ర. అది చూస్తే ఎవరైనా ఆ పాత్రని అసహ్యించుకుంటారు. ఓ రకంగా చెప్పాలంటే పిసినారితనంలో అది పీక్‌ లెవల్‌ అని చెప్పొచ్చు. బట్టలకు బదులు న్యూస్‌ పేపర్‌ చుట్టుకోవడం, బాత్‌ రూమ్‌లో వాటర్‌కి బదులు పేపర్‌ వాడటం, టూత్‌ పేస్ట్ ని వాడే విషయంలో, కోడికూర తినడానికి బదులు కోడిని ఇంటి చూరుకి కట్టి దాన్ని చూస్తూ కోడి కూర తింటున్నట్టుగా ఫీల్‌ కావడం, అప్పు విషయంలోనూ ఆ పిసినారి తనం మెయింటేన్‌ చేయడం వాహ్‌ అనిపిస్తుంది. ఆ పాత్రకి విశేష ప్రశంసలు దక్కాయి. కోటని విలన్‌ నుంచి కమెడియన్‌గా మార్చిన మూవీ ఇది. ఈ చిత్రానికి జంధ్యాల దర్శకత్వం వహించడం విశేషం. ఈ మూవీలో రాజేందప్రసాద్‌ నటన కంటే కోట నటనే డామినేటింగ్‌గా ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories