Mamitha Baiju: అప్పుడు సూర్యను కలవలేక కన్నీళ్లు.. ఇప్పుడు ఆయన పక్కనే హీరోయిన్‌గా, లైఫ్‌ టర్నింగ్‌ మూమెంట్

Published : Aug 12, 2026, 06:52 AM IST

Mamitha Baiju: 2015లో 8వ తరగతి చదువుతున్నప్పుడు యాక్టర్ సూర్యను కలవలేకపోయానని ఓ అమ్మాయి చాలా బాధపడింది. కానీ ఇప్పుడు, అదే సూర్య సినిమాలో హీరోయిన్‌గా, అదే ప్లేస్‌లో ఆయనతో కలిసి ఎంట్రీ ఇచ్చింది.

PREV
16
8వ తరగతిలో సూర్యని కలవాలనుకున్న మమితా బైజు

నటి మమితా బైజు సినీ ప్రయాణంలో ఓ అందమైన 'ఫుల్ సర్కిల్' మూమెంట్ ఇది. తమిళ నటుడు సూర్య సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ రావడం ఆమెకు కేవలం సినిమా అవకాశమే కాదు, చిన్ననాటి కల నిజమైన క్షణం కూడా. మమితా బైజు 8వ తరగతి చదువుతున్నప్పుడు, కేరళలోని లులూ మాల్‌కి ఓ కార్యక్రమానికి సూర్య వచ్చారు. అప్పుడు సూర్యను ఒక్కసారైనా కలవాలని చిన్నారి మమిత చాలా ఆశపడింది.

26
సూర్యని కలిసే ఛాన్స్ మిస్‌
సూర్య దగ్గరికి వెళ్లి ఫోటో దిగాలని మమిత ఎంతో ఆశపడింది. కానీ, వాళ్ల పేరెంట్స్ ఆమెను ఆ కార్యక్రమానికి తీసుకెళ్లడానికి ఒప్పుకోలేదు. దీంతో తన ఫేవరెట్ హీరోను కలిసే ఛాన్స్ మిస్ అయింది.
36
సూర్యని మిస్‌ చేసుకున్నందుకు మమితాలో బాధ
మమితా వాళ్ల అన్నయ్య, అతని ఫ్రెండ్స్ సూర్యను కలిసి ఆయనతో ఫోటో దిగారు. ఆ ఫోటోను మమితాకు చూపించడంతో, తాను మాత్రం సూర్యను కలవలేకపోయాననే బాధ ఆమెలో మరింత పెరిగింది.
46
హీరోయిన్‌గా మారిన మమితా బైజు

కాలం మారింది. ఆ చిన్నారి పెరిగి, నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కానీ చిన్ననాటి ఆ జ్ఞాపకం మాత్రం మమిత మనసులో అలాగే ఉండిపోయింది. మలయాళం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మమిత, ఇప్పుడు స్టార్ హీరోలతో నటిస్తోంది.

56
సూర్యతోనే లులూ మాల్ కి వచ్చిన మమితా
ఏళ్ల తర్వాత, మమితా మళ్లీ అదే లులూ మాల్‌కు వచ్చింది. కానీ ఈసారి సీన్ పూర్తిగా రివర్స్. అప్పుడు సూర్యను కలవలేక బాధపడిన అమ్మాయి, ఇప్పుడు ఆయన సినిమాకే హీరోయిన్‌గా, ఆయన పక్కనే నిలబడింది!
66
అప్పుడు చూసే ఛాన్స్ మిస్‌, ఇప్పుడు ఏకంగా ఆయనతోనే హీరోయిన్‌గా

ఒకప్పుడు దూరం నుంచి అయినా తన ఫేవరెట్ హీరోను చూడాలని ఆరాటపడిన మమిత, ఇప్పుడు అదే నటుడితో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. ఫ్యాన్‌గా మొదలైన ఆమె ప్రయాణం, ఇప్పుడు సినిమా ప్రపంచంలో ఓ అందమైన అధ్యాయంగా మారింది. 2015లో మిస్ అయిన ఆ మూమెంట్, హీరోయిన్‌గా మారి ఇప్పుడు పూర్తయింది. ఇదే కదా అసలైన 'ఫుల్ సర్కిల్' మూమెంట్ అంటే. ఇక సూర్య, మమితా బైజు నటించిన `విశ్వనాథ్‌ అండ్‌ సన్స్` మూవీ ఈనెల 14న విడుదల కాబోతుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories