ఇంటర్మీడియట్ తర్వాత ఆయన ఎలాంటి ఉన్నత విద్య లేదా డిగ్రీ అభ్యసించలేదు. విద్యకు స్వస్తి చెప్పి, చదువుకంటే సినిమాలపై ఉన్న మక్కువతో ఫిల్మ్ ఎడిటింగ్, అసిస్టెంట్ డైరెక్షన్ వైపు తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ విషయంలో రాజమౌళి భార్య రమా రాజమౌళి కూడా స్పందించారు. ఈ విషయంలో ఆమె తరచూ సరదాగా సెటైర్లు వేస్తుంటారు.
"ఆయన పెద్దగా చదువుకోలేదు.. కేవలం ఇంటర్మీడియట్ వరకు మాత్రమే చదివారు" కానీ సర్టిఫికెట్లు మాత్రం మేం ఎప్పుడూ చూడలేదు, మా ఫ్యామిలీలో ఎవరు పెద్దగా చదువుకోలేదు. రాజమౌళి మాత్రమే ఇంటర్ చదివాను అంటాడు. కానీ రాజమౌళి.. పుస్తకాలు బాగా చదువుతాడు, అది ఆయన నాలెడ్జ్ కు కారణం. చిన్నప్పటి నుంచి ‘అమర్ చిత్ర కథలు’, రామాయణ, మహాభారతాలు చదవడం ఆయనకు అలవాటు, నిరంతరం కొత్త విషయాలను నేర్చుకోవడం ద్వారా ఆయన అద్భుతమైన జ్ఞానాన్ని పెంపొందించుకున్నారని'' రమా రాజమౌళి చెప్పారు.